MD NASEER MIYA , CRIME REPORTER, BHADRADRI KOTHAGUDEM. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : శాంతికి.. కరుణకు ప్రతీకగా నిలిచే క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా ముందస్తుగా నిర్వహించే క్రిస్మస్ క్యారెల్స్ తో కొత్తగూడెంలో శనివారం సందడి నెలకొంది. క్రైస్తవుల నివాసాలకు ఇంటింటా కలియతిరుగుతూ శాంతన్ క్లాక్ వేషధారణలో క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలుపుతూ, 2026 నూతన సంవత్సర క్యాలెండర్ అందజేస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. డ్రమ్స్ వాయిస్తూ.. పాటలు పాడుతూ.. నృత్యాలు చేస్తూ ఏసుప్రభు జన్మదిన సందర్భంగా ముందస్తు వేడుకలను స్థానిక చర్చ్ పాస్టర్లు, సభ్యులు ఘనంగా నిర్వహించారు. క్రైస్తవ కుటుంబాలకు పాస్టర్లు దీవెన ఆశీర్వాదాలు అందజేసి ఏసుప్రభు చూపిన శాంతి మార్గంలోనే ప్రతి ఒక్కరు జీవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సి.ఎస్.ఐ సెయింట్ ఆండ్రూస్ చర్చ్ పాస్టేట్ చైర్మన్ భీమాల అబిజిత్,పాస్టర్లు సుందర్ రాజు, ఏసేపు, కమిటీ సభ్యులు జాన్ రత్నం,సన్నీ సంతోష్,సుజయ్, సభ్యులు బన్నీ విజయ్,గుణ సురేష్, సుధీర్,ప్రశాంత్,మనోజ్,శామ్యూల్, తదితరులు పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily