D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 12 వైరా (అక్షరం న్యూస్) వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలో సెంట్రల్ లైటింగ్ ని సోమవారం రాత్రి ప్రారంభించారు.గ్రామంలో ఎన్నో రోజులుగా స్థానిక సెంటర్లో సరియైన లైటింగ్ లేక గ్రామస్తులు మరియు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు ఇది గమనించిన సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాస్ ఉన్నత అధికారులతో నాయకులతో చర్చించి గ్రామంలో సెంటర్ లైటింగ్ ని ఏర్పాటు చేపించారు. అనంతరం స్థానిక సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. ముందు ముందు రోజుల్లో గ్రామం అభివృద్ధి చెందేలా నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పుష్పవతి, మొరంపూడి మధు, పరుచూరి రామారావు, మోరంపూడి బాబు, దరిపల్లి నారాయణ, కాటమ్మ, నారపోగు వెంకటి, అయినాల కనక రత్నం మరియు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు..
.
Aksharam Telugu Daily