D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ... ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ తల్లాడ డిసెంబర్ 13( అక్షరంన్యూస్) మండల పరిధిలోని మంగాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విద్యావంతుడు, మాజీ ఉపసర్పంచ్ గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు సర్పంచ్ బరిలో సిద్ధంగా ఉన్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి ఆధ్వర్యంలో 14 లక్షల రూపాయల వ్యాయాయంతో గ్రామంలో సిసి రోడ్లను ఏర్పాటుచేసి, 9 ఇందిరమ్మ ఇల్లు, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నాంది పలుకుతాయని, మరొకసారి గ్రామ ప్రజల అవకాశం ఇస్తే గ్రామంలో మరికొన్ని అభివృద్ధి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకులు చింటూ మాట్లాడుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమై నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయినా, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయని గ్రామ ప్రజలందరూ కూడా మీ అమూల్యమైనమైన ఓటు ముద్రను కత్తెర గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ఓటర్ల మహాశయులను అభ్యర్థించారు.
.
Aksharam Telugu Daily