D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్/ జనవరి 6 (అక్షరం న్యూస్) కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని.. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు.సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు జరగకుండా తీసుకుంటున్న చర్యలలో భాగంగా గతంలో కోడిపందేలు, పేకాట స్థావరాలు నిర్వహించిన వారిని బైండోవర్ చేయాలని, అదేవిదంగా కౌన్సిలింగ్ నిర్వహించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. టాస్క్ ఫోర్స్, నిఘా విభాగాలు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి కోడిపందాలను కట్టడి చేయాలని ఆదేశించారు. చైనా మాంజా విక్రయించిన, వినియోగించిన చర్యలు.. పక్షులతో పాటు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజాను ఎవరైనా విక్రయించిన, వినియోగించిన వారి పట్ల కఠినంగా వ్యవహారిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. సంక్రాతి పండుగ సమిపిస్తున్న వేళ యువత గాలి పటాలను ఎగురవేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో యువత అధికంగా చైనా మాంజా ఉపయోగించి గాలి పటాలను ఎగుర వేయడం ఆసక్తి కనబరుస్తారు. కాని యువత వినియోగించే చైనా మాంజా ( సింథటిక్ దారం, గాజు పొడి) చాలా ప్రమాదకమని, ఈ దారాన్ని ఉపయోగించడం ద్వారా పక్షుల గొంతు, రెక్కలు తెగిపోవడం, మనుషులకు గాయాలు కావడం జరుగుతుంది.ఎవరైనా చైనా మాంజా విక్రయించిన వినియోగించిన జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. చట్టవిరుద్ధమైన చైనా మాంజా నియంత్రణ కై ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎవరైనా చైనా మాంజా విక్రయాలకు పాల్పడితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.
.
Aksharam Telugu Daily