D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ జనవరి 12 తల్లాడ (అక్షరం న్యూస్) తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షు లు కోడూరు నాగేశ్వరరావు తల్లాడ సర్పంచ్ థమ్స సప్ కంపెనీ డీలర్ పెరికి నాగేశ్వరరావు సంతూర్ కంపెనీ డీలర్ అనుమోలు సర్వేశ్వరరావు సంయుక్తంగా రంగవల్లుల (ముగ్గులు) పోటీలు సోమవారం నిర్వహించారు. పోటీలలో 52 మంది మహిళలు ఉత్సాహంగా అమ్మలు అక్కలు చెల్లెలు పాల్గొన్నారు. వీరిలో ప్రధమ ద్వితీయ, తృతీయ ,మూడు రంగవల్లులను ప్రకటించారు. బాలభారతి విద్యాలయం టీచర్స్ కృష్ణవేణి ,సునీత ఇద్దరు న్యాయ నిర్ణీతలుగా పాల్గొని నిర్ణయించారు. ప్రధమ బహుమతి వేమిరెడ్డి శ్రీలత, ద్వితీయ నరాల మౌనిక, తృతీయ బహుమతి చీరాల అనూష గెలుచుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు, సర్పంచ్ పెరికె నాగేశ్వరరావు, అనుమోలు సర్వేశ్వరరావు , డిస్టిక్ జాయింట్ సెక్రెటరీ దారా శ్రీనివాసరావు , జెడ్ సి బెల్లంకొండ ఆంజనేయులు, అందరు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గురు సంయుక్తంగా నిర్వహించిన పోటీలలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు గెలుచుకున్నందుకు సంతోషంగా ఉంది అని సంక్రాంతి సందర్భంగా పాల్గొన్న మహిళలందరికీ గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసి దగ్గుల రాజశేఖర్ రెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు వేమిరెడ్డి నాగిరెడ్డి , వేమిరెడ్డిచిన్న కృష్ణారెడ్డి, కటికి వెంకటేశ్వరరావు, శీలం వెంకటరెడ్డి, తోట మురళి తల్లాడ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily