Monday, 15 December 2025 07:50:35 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్ స్థాయి వైద్యం పేరుతో పేద ప్రజల సొమ్మును దోచుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రి. ఆస్పత్రి పేరేమో మనుషులను బ్రతికించేది, ఆసుపత్రి

ప్రభుత్వ వైద్య అధికారులే ప్రోత్సహిస్తున్నారా?


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 08 November 2025 03:12 PM Views : 139

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : హాస్పిటల్ యజమాన్యం ప్రభుత్వ వైద్యులు, కరీంనగర్/జమ్మికుంట/నవంబర్ 8/అక్షరం న్యూస్: జమ్మికుంట పట్టణంలోని ఆసుపత్రి గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నామని ప్రజలను బురిడీ కొట్టిస్తూ లక్షల లక్షలు దోచుకుంటున్నట్లు ప్రజలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే జమ్మికుంట పట్టణంలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రి కార్పొరేట్ స్థాయి వైద్యం పేరుతో పేద ప్రజలను పీడించి లక్షల్లో దోచుకుంటున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ సొంతగా ప్రైవేట్ హాస్పిటల్లు ఏర్పాటు చేసుకొని గ్రామీణ ప్రాంతం నుండి వచ్చే పేద రోగుల నుండి లక్షల్లో దండుకుంటున్నా గాని జిల్లా వైద్యాధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి ఒక్కరోజు అడ్మిన్ అయితే 20000 నుండి 30 వేల రూపాయల ఫీజు, డాక్టర్ వచ్చి పేషెంట్ ని పరీక్షిస్తే ఒక రోజుకి 1500 రూపాయలు తీసుకుంటూ పేద ప్రజలను నిలువునా దోపిడికి గురి చేస్తున్నా కానీ జిల్లా వైద్య అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించుకుంటూ పట్టణంలో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తూ ఇటు ప్రజలను ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న కానీ జిల్లా వైద్య అధికారులకు ఎందుకు కనబడడం లేదు. ఇలాంటి ప్రైవేట్ ఆస్పత్రి పైన చర్యలు తీసుకుంటే తప్ప పట్టణంలో పేద ప్రజలకు న్యాయమైన వైద్యం అందే పరిస్థితి కనబడటం లేదని పలువురు మేధావులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ వైద్యులు యజమాన్యంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఆస్పత్రిని ఎవరి అండ దండ తో నడుపుతున్నారో ప్రజలకు అర్థం కాని ప్రశ్న? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యాధికారి ఇలాంటి ఆసుపత్రి పైన ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించి చర్యలు తీసుకుంటే తప్ప పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించి లక్షల్లో దోపిడి నుండి ఉపశమనం కలిగించిన వారు అవుతారని ప్రజలు కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :