Monday, 15 December 2025 06:59:41 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత సాహితీ లోకానికి తీరని లోటు


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 10 November 2025 11:46 AM Views : 104

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/నవంబర్-10(అక్షరం న్యూస్) ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ను రచించిన అందెశ్రీ (64) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని లాలాగూడలో నివసిస్తున్న ఆయన రాత్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యులు పరిశీలించి ఆసుపత్రికి చేరుకునేలోపే అందెశ్రీ మృతి చెందినట్లు వెల్లడించారు. ఆయన ఇంటి వద్దే మరణించినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అందెశ్రీ జీవితం:1961 జులై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో అందెశ్రీ జన్మించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అందెశ్రీ ముఖ్య పాత్ర పోషించారు. ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిన నింపిన కవి అందెశ్రీ. రాష్ట్ర ఉద్యమంలో ప్రజల నోట మారుమోగిన ‘జయజయహే తెలంగాణ’ గీతంతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ముఖ్యంగా ‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు’ పాటతో అందెశ్రీ ప్రజల్లో అపారమైన గుర్తింపును సంపాదించారు. అందెశ్రీ అసలుపేరు: పాఠశాల విద్య లేనప్పటికీ, కవిగా తనదైన శైలి చూపించి సాహితీ ప్రపంచంలో నిలిచారు. జీవిత ప్రారంభంలో గొర్రెల కాపరిగా పనిచేసి, తరువాత భవన నిర్మాణ కూలీగా చేశారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అందెశ్రీకి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందెశ్రీ అసలుపేరు అందె ఎల్లయ్య

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :