Friday, 17 May 2024 02:14:30 AM
 Breaking
     -> నకిలీ విత్తనాలు విక్రయించిన శ్రీ లక్ష్మీ సీడ్స్ వారిపై చర్యలు తీసుకోవాలి :..      -> భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అహ్లె సున్నతుల్ జమాత్ జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ కరీం ..      -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..

పార్టీలు మారీన వారికి అందలం...కాంగ్రెస్ పార్టీలో ముస్లిం మైనార్టీ నాయకులకు అవమానం

మైనార్టీలు అంటే చిన్న చూపా... ప్రభుత్వం ఏర్పాటులో మైనార్టీలదే కీలక పాత్ర.... ● రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడడమే మా లక్ష్యం....కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం మా ధర్మం ● రాష్ట్ర మైనారిటీ నాయకులకు, జిల్లా నాయకులకు విద్యానగర్ కాలనీ మంత్రుల సన్నాహక సమావేశానికి పిలుపు రాలేదు

Date : 29 April 2024 07:41 PM Views : 205

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ● భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ ఏప్రిల్.29/ అక్షరం న్యూస్; కాంగ్రెస్ పార్టీలో ముస్లిం మైనారిటీ నాయకులకు గుర్తింపు లభించడం లేదని, పార్టీ ని నమ్ముకుని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నాయకులను విస్మరించారని ముస్లిం నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీలు మారీన వారికి అందలం... ఎక్కించి ముస్లిం మైనార్టీ నాయకులను విస్మరించారని సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నయీమ్ ఖురేషి , జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం రాత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి జిల్లా మైనార్టీ నాయకులకు ఆహ్వానం లేదని, వేదిక పై ఇటీవలే పార్టీ మారిన అందరిని ఆహ్వానించారని , వేదికపై మైనార్టీ నాయకులకు చోటు దక్కలేదని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా అనేక కేసులో అనేక ఇబ్బందులు అనేక అవమానాలు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ నాయకులకు, జిల్లా నాయకులకు ఈ సన్నాహక సమావేశానికి పిలుపు రాలేదని, కనీసం చివరినిమిషం లో వేదికపైకి పిలిచే పేర్లలో కూడా పేర్లు చేర్చలేదని, ఇదే విచిత్రంగా ఉందని, దిక్కు లేక ఎలాగో తాము కాంగ్రెస్ కె ఓట్లు వేస్తామని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ పక్షాన నిలబడి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని, గౌరవానికి బదులుగా అవమానాలు జరుగుతున్నాయని, ఇది తగదు ఇట్టి విషయాలన్నీ రాష్ట్ర అధిష్టానానికి, జిల్లా అధిష్టానాని దృష్టికి తీసుకొని వెళ్తామని, పిలుపు ఉన్న లేకున్నా గౌరవం ఉన్నా లేకున్నా గుర్తించిన గుర్తించకపోయినా ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి ఎన్నికలు కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమే మా ముందున్న లక్ష్యం .కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం మా ధర్మం అని వారి గెలుపుకు నిరంతరం రేయింబవళ్ళు కష్టపడి గెలిపించుకు తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత జిల్లా మొత్తం ఉన్న మైనార్టీలను పిలుపునిచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభలో మా నిర్ణయాలను తెలియపరుస్తామని, అప్పటివరకు ఎవరు అధైర్య పడకండి ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తే ఎదుర్కొని నిలబడి ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై అభ్యర్థుల గెలుపుకై పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, ఉపాధ్యక్షులు ఎండి .కరీమ్ పాషా, సెక్రటరీ గౌస్ పాషా, నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు గౌసుద్దీన్, ఆర్గనైజ్ సెక్రటరీ దస్తగిరి, టౌన్ అధ్యక్షులు జానీ పాషా, ఉపాధ్యక్షులు ఎండి .అక్బర్, బాయ్, జనరల్ సెక్రటరీ ఖమర్, సెక్రటరీ అహ్మద్, పాల్వంచ మైనార్టీ ప్రెసిడెంట్ సత్తార్, అమీర్ , ఫైజుద్దీన్, యూత్ మైనార్టీ టౌన్ అధ్యక్షులు నయీమ్ తదితరులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :