Tuesday, 14 May 2024 02:36:44 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలి..*

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..*

Date : 08 April 2024 03:24 PM Views : 345

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్/సంగెం : * *- వరంగల్ జిల్లా /సంగెం /ఏప్రిల్ 08/అక్షరం న్యూస్. లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పార్టీ అభ్యర్థిని ఎవరిని సూచించిన గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు కృషిచేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.సోమవారం హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో సంగెం మండలంలోని అన్ని గ్రామాల నాయకులు,కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ..లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ సెగ్మెంట్లో పార్టీ ఎవరిని సూచించిన ఆ అభ్యర్థి గెలుపుకు ప్రతికార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలి. కార్యకర్తలు, నాయకులందరూ ఐక్యతతో కృషి చేసి కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన పనులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రాజెక్టులతో జరిగిన మేలు గురించి గడపగడపకూ వెళ్లి వివరించాలని సూచించారు. పార్టీకి నమ్మకద్రోహం చేసి పార్టీలు మారిన వారితో నష్టంలేదు.మల్లి పార్టీలోకి వారు వస్తానన్న తీసుకునే ప్రసక్తేలేదు. నేను పార్టీ మారుతున్నానని కొంతమంది అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు.అలాంటి ప్రచారాలను ఎవరు నమ్మొద్దు.పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. ఉద్యమనాయకుడు,తెలంగాణరాష్ట్ర సాధకుడు మాజీ సీఎం కేసీఆర్ వెంటే ఉంటా.. అధికారంలోకి వస్తే వందరోజుల్లో హామీలు అమలుచేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ.. వంద రోజులు దాటినా హామీల అమలు ఎటుపాయె? లోక్‌సభ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతరు అని, కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.కాంగ్రెస్‌ వచ్చినప్పటినుంచి ఇటు రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులొచ్చాయి.నేడు పదేండ్లు సీఎంగా కేసీఆర్‌ చేసిన కృషి అభినందించదగినదనే విషయాన్ని ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ తగ్గింది, వ్యతిరేకత మొదలైంది..లోక్ సభ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్.అభ్యర్థులను ప్రజలు భారీ మెజారిటతో గెలిపివ్వడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు.ఈ సమావేశంలో జెడ్పిటిసి గూడ సుదర్శన్ రెడ్డి,మండల అధ్యక్షులు పసునూరి సారంగపాణి,వైస్ ఎంపిపి బుక్క మల్లయ్య,నాయకులు పులుగు సాగర్ రెడ్డి,ధొనికేల మల్లయ్య,ఉండీల రాజు,బొంపెల్లి దిలీప్ రావు,షాబోతు శ్రీనివాస్,గుగులోతు వీరమ్మ,ఎంపిటిసిలు,మాజీ సర్పంచులు,గ్రామ పార్టీ అధ్యక్షులు,కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :