Tuesday, 14 May 2024 05:37:42 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

ఆరు గ్యారంటీ లలో ఆరింటిని పార్లమెంట్ ఎన్నికల్లోగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి

కాంగ్రెస్ర్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం -రైతుబందు ఎకరానికి 15000 వెంటనే ఇవ్వాలి -కౌలు రైతులకి కూడా రైతు బందు ఎకరానికి 15000 ఇవ్వాలి -వెంటనే రెండు లక్షల రుణ మాఫీ చేయాలి -ఎస్సారెస్పె నీటిని చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలి -రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ జిల్లాలో పర్యటించాలి. -బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్

Date : 03 April 2024 08:14 PM Views : 172

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : - చొప్పదండి /కరీంనగర్,ఏప్రిల్ 03 (అక్షరం న్యూస్ ) చొప్పదండి నియోజకవర్గంలో రైతులు సాగునీరు కోసం, ప్రజలు త్రాగునీరు కోసం అల్లాడుతుంటే రోమ్ నగరం తగలబెడుతుంటే నిరో చక్రవర్తి పిడేల్ వాయించినట్టు కాంగ్రెస్ నాయకులు ఏమాత్రం ప్రజలను పట్టించుకోవడంలేదని బిజెపి జిల్లా ప్రధానకార్యదర్శి తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. చొప్పదండి పట్టణంలో అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రావణ్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీ లలో ఆరు పూర్తిగా అమలు చేసి కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ప్రజల ముందుకు రావాలని, లేకపోతె ప్రజలే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెపుతారని అన్నారు. రైతు బందును ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా పది హేను వేల రూపాయలు ను ఎటువంటి నిబంధనలు లేకుండా రైతులు అందరికి వెంటనే ఇవ్వాలని అన్నారు. అలాగే కౌలు రైతు లకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విదంగా పది హేను వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ కి అతీ గతీ లేదని ద్వజ మెత్తారు. ఎస్సారెస్పీ నీటిని చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలని అన్నారు.పూర్తిగా వ్యవసాయం పై ఆధారపడ్డ నియోజకవర్గ ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించవలసిన కాంగ్రెస్ నాయకులు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా చొప్పదండి నియెజక వర్గంలోని రాగంపేట, రెవెళ్లి మొదలుకొని కోడిమ్యాల మండలాల్లో ఎన్ని చెరువులు, కుంటాలు ఎన్ని నింపారో ఎమ్మెల్యే మెడిపెళ్లి సత్యం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రైతుల వరి ధాన్యానికి 2200 కేంద్ర మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన 500 కలిపి చెల్లించాలని లేనట్లయితే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రైతులకు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ, పంట నష్ట పరిహారం అమలు చేయకుండా రతులను మోసం చేసిన కేసీఆర్ ఏ మొఖం పెట్టుకుని జిల్లాలో పర్యటిస్తారని ఆయన నిలదీశారు. చొప్పదండి నియోజకవర్గంలో తానే స్వయంగా పదివేలు పంటనష్ట పరిహారం ఇస్తామన్న కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పి జిల్లాలో పర్యటించాలని ఆయన డిమాండ్ చేశారు. గద్దెకు ఎక్కిన 5 రోజుల్లో 2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో రైతులు నిలదిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణా రెడ్డి, బిజెపి జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ, చొప్పదండి పట్టణ అధ్యక్షులు బత్తిని ప్రశాంత్,చొప్పదండి, గంగాధర, కోడిమ్యాల, బోయినపల్లి, మాల్యాల మండలాల అధ్యక్షులు మావురం సుదర్శన్ రెడ్డి, కొల అశోక్, రేకులపల్లి రవీందర్ రెడ్డి, గుడి రవీందర్ రెడ్డి, నెరేళ్ల శ్రావణ్ రెడ్డి, చొప్పదండి పట్టణ బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు వడ్లూరి సుధాకర్,నాయకులు చిల్ల శ్రావణ్, గుండేటి శివశంకర్, జిట్టా కుమార్, వెంకటరమణ రెడ్డి, చల్ల అనూష్, గంగు సంపత్ తదితరులు ఉన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :