Tuesday, 14 May 2024 11:19:43 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన తప్పదు..

దండు ఆదినారాయణ

Date : 05 April 2024 08:54 AM Views : 289

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ ఏప్రిల్ 4 (అక్షరంన్యూస్) ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రెండు నెలలు గడుస్తున్నా కూలి డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారని అదేవిధంగా పనిచేసే ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని అధికారులు వెంటనే స్పందించి వారి సమస్యలు పరిష్కారం చేయకపోతే మండల కార్యాలయాలు ముట్టడిస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దండు ఆదినారాయణ హెచ్చరించారు. తల్లాడ లో ఉపాధి కూలీల సమావేశం ఓర్సు రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీల పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని,కూలీలు పనులు చేసే నెల గడుస్తున్నా వారికి డబ్బులు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకానికి ఇవ్వవలసిన నిధుల్లో కోత పెట్టి ఉపాధి హామీ పథకాన్ని తీసేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో మోడీని ఓడించాలని లేదంటే ఉపాధి హామీ పథకం కూడా ఉండదని ఆయన కూలీలకు విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం 600 రూపాయలు ఇయ్యాలని,పనిచేసే ప్రదేశంలో టెంట్ ప్రాథమిక వైద్య సౌకర్యం మంచినీళ్లు ఇవ్వాలని గ్యాస్ ఆలవేన్స్ ఇవ్వాలని, పలుగుతట్ట, పారా మంచినీళ్లకు, డబ్బులు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఒక్కొక్క ఉపాధి కూలీకి సంవత్సరానికి ₹12,000 ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉపాధి కూలీల పట్ల ఉపాధి హామీ పథకం పట్ల మోడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదు అని హెచ్చరించారు. అసలే ధరల మీద కూలీలు ఇబ్బంది పడుతుంటే మూలిగే నక్క మీద తాటి పండు చందంగా ప్రజలను ఇబ్బందులు పెడుతూ పాలన సాగిస్తున్నారని,కూలీలకు డబ్బులు ఇవ్వలేని దుర్మార్గమైన స్థితిలో మోడీ ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహిళా సమైక్య జిల్లా డివిజన్ నాయకులు ఎస్కే రంజాన్బి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో ఎక్కువగా మహిళల పని చేస్తున్నారని మహిళల పట్ల మోడీకి చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు రానున్న కాలంలో మహిళలందరూ ఐక్యంగా ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవడానికి పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం తల్లాడ ఉపాధి హామీ కూలి సంఘం కమిటీని బి కే యం యు ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షురాలుగా తాటికొండ లీలావతి కార్యదర్శి గా ఎస్కే మున్ని,సహాయ కార్యదర్శిగా కృష్ణవేణి, కోశాధికారిగా ఎస్కే సలీమా,సన్నీ, మౌనిక, భూలక్ష్మి,లింగయ్యలు ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :