Wednesday, 15 May 2024 03:34:20 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

రామగుండం నియోజకవర్గంలో తుగ్లక్ పాలన మొదలైంది.

అసలు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అనే భయం లో ప్రజలు. ఎలాంటి నోటీసులు లేకుండా రాత్రికి రాత్రి బుల్డోజర్ తో కూల్చడమేంటి. ఓల్డ్ అశోక్ థియేటర్ సింగరేణి కార్మికుల క్వార్టర్ల కూల్చివేత చేస్తున్నది ఎవరు?

Date : 29 March 2024 06:07 PM Views : 1124

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : సింగరేనా!రామగుండం కార్పొరేషనా!ఎమ్మెల్యే నా! ఎవరు అనేది స్పష్టం కాక చిరు వ్యాపారుల ఆందోళన. మీరు చేస్తున్నదేంటో బాధితులను అఖిలపక్షాల నాయకులను పిలిచి చర్చించి చేస్తున్నది చెప్పాలి. ఎమ్మెల్యే కు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హితువు. గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/మార్చి 29/అక్షరం న్యూస్: గోదావరిఖని పట్టణంలోని చిరు వ్యాపారులను సింగరేణి కార్మికుల డిపెండెంట్ లు కుటుంబాలు నివాసం ఉంటున్న క్వార్టర్ల లను కూల్చివేసేందుకు దౌర్జన్యానికి పాల్పడుతు ఓల్డ్ అశోక్ థియేటర్ కూల్చివేత చుట్టుపక్కల ఉన్న చిరు వ్యాపారులను తొలగించాలని భయభ్రాంతులకు గురి చేయడం రామగుండంలో తుగ్లక్ పాలన మొదలైందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి బి ఆర్ ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తా సమీపంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న హాయంలో మాజీ మంత్రి కేటీఆర్ ను ఒప్పించి మాజీ సీఎం కేసీఆర్ ను మెప్పించి రామగుండం కార్పొరేషన్ కు వందలాది కోట్ల నిధులను తెచ్చామని ఆ నిధులతోనే ప్రస్తుతం అభివృద్ధి చేస్తూ తన వంద రోజుల పాలన లో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ఎమ్మెల్యే సొంతగా నిధులు తేలేకపోయారని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న తాను గోదావరిఖనిలో మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేశానని తద్వారా కొంతమందికి నిరుద్యోగులకు ఉపాధి లభించింది అని రామగుండం నియోజకవర్గంలోని ప్రజలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందుతుందని వారి ఆరోగ్యం బాగుపడుతుందని ఆలోచన చేసి మెడికల్ కాలేజీ తెచ్చామని ఆ విధంగా ప్రజాపాలన చేయాల్సింది పోయి ప్రజలకు మేలు జరిగే పనులను పక్కనపెట్టి వారిని భయాందోళన గురి చేసే విధంగా పనులు ఉండవద్దని ఏండ్ల తరబడి జీవిస్తున్న చిరు వ్యాపారులు సింగరేణి కార్మిక కుటుంబాలు వాటన్నింటినీ కూల్చివేత పేరుతో తొలగిస్తామనడం సరైంది కాదని ముందుగా ప్రజలకు సమాజానికి తను చేస్తున్న విధానాన్ని చెప్పాలని అన్నారు.రాత్రికి రాత్రే బుల్లోజర్లతో స్థానిక లక్ష్మీ నగర్ లోని ఓల్డ్ అశోక్ థియేటర్ ను కూల్చివేయడం చుట్టుపక్కల అనుకుని చిరు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న చిరు వ్యాపారుల షట్టర్ షాపులను తొలగించాలని అనడం తో వారి జీవితాలు అగమ్య గోచరంగా మారుతున్నాయని అన్నారు ఎలాంటి నోటీసులు అందజేయకుండా దౌర్జన్యంగా కూల్చివేత పనులకు పూనుకున్నది ఎవరనేది స్పష్టం కాక ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు ఈ కూల్చివేతకు పాల్పడుతుంది సింగరేణి ఏనా!లేక రామగుండం కార్పొరేషనా!స్థానిక ఎమ్మెల్యే నా! కాంగ్రెస్ నాయకులా! ఇలా ఎవరన్నది స్పష్టం కాకుండా ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కూల్చి వేస్తున్నారని తన దృష్టికి బాధితులు తీసుకొచ్చారని ఈ విషయమై ఎమ్మెల్యే చిరు వ్యాపారులకు ప్రజలందరికీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని బాధితులు అందరిని అఖిలపక్ష నాయకులను పిలిపించి తాను చేస్తున్న అభివృద్ధి పనుల ప్రణాళిక ఏంటి కూల్చివేతల వల్ల జరిగే అనర్ధాలు ఏంటి వారికి ఎలాంటి జీవనోపాధి కల్పిస్తారని విషయాలను స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించాల్సిందిగా ఆయన ఎమ్మెల్యేకు సూచించారు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో పట్టణాన్ని సుందరీకరణను చేయడానికి రోడ్లను విస్తరించడానికి అభివృద్ధి చేయడానికి అందరూ స్వాగతిస్తున్నారని చేస్తున్న అభివృద్ధిలో కూల్చివేతలు ఒకవైపునుండే కాకుండా రోడ్డు సెంటర్ నుండి ఇరువైపున కూల్చివేతలు చేయాల్సిన అవసరం ఉందన్నారు తమ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకుల షెటర్లు భవంతులు ఉన్నందున పోచమ్మ మైదానంలో అక్రమంగా ఆక్రమించిన భవంతులను ఎందుకు కూల్చివేయడం లేదని ప్రశ్నించారు చిరు వ్యాపారం చేసుకుని బ్రతికే వారి పరిస్థితి ఆత్మహత్యలకు ప్రేరేపించేదిగా ఉందని అంతేకాకుండా తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఫ్లెక్సీ హోల్డర్ వారందరూ మద్దతుగా ఉన్నారని నెపంతో ప్రతి కారం తీర్చుకునేందుకే ఫ్లెక్సీ హోల్డింగ్ లను ఆ యజమానులకు తెలియకుండా తొలగించి కక్షసాధింపు ధోరణి అవలంబిస్తున్నారని అన్నారు మార్పు అని మార్పు అని ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలో అమలు చేస్తామని 5 గ్యారెంటీలు కూడా అమలు చేయలేదని ప్రజలు ఎక్కడ నిలదీస్తారు అని 4000 వృద్ధాప్య పెన్షన్ 6000 వికలాంగుల పెన్షన్ మహాలక్ష్మి 2500 గ్యాస్ సిలిండర్ 500 ఉచిత 200 యూనిట్ల కరెంటు ఇందిరమ్మ ఇండ్ల గురించి నిలదీస్తారని ఆ గ్యారంటీలను మరిచిపోయేందుకే మరలించేందుకే కూల్చివేత దౌర్జన్యానికి తెరలేపారని చందర్ విమర్శించారు రైతులకు సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని రైతు బీమా డబ్బులు చెల్లించక రైతు రుణ మాఫీ చేయకుండా రైతుబంధు రైతు బీమా కౌలు రైతుకు బీమా బంధువు అమలు చేయకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు రైతన్ననికి సాగునీరు ప్రజలకు తాగునీరు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని విమర్శించారు పెద్దపెల్లి జిల్లాలోని రైతన్న లను ఆదుకునేందుకు రామగుండం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చే మాట్లాడి పంట పొలాలు ఎండిన రైతులకు ఒక్కొక్కరికి 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించే విధంగా చేయాలని ఆయన ఎమ్మెల్యేను కోరారు. .................. 30న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 36 గంటల రైతుల నిరసన దీక్ష. రైతన్ననికి అండగా ఉండేందుకు పంట పొలాలు ఎండిపోయి రైతన్నలు నష్టపోతున్న వారికి అండగా నిలిచేందుకు బి ఆర్ ఎస్ పార్టీ అన్నివేళలా మద్దతుగా నిలుస్తుందని రైతాంగ సమస్యలపై వారికి నష్టపరిహారం చెల్లించేందుకు ఈనెల 30న శనివారం ఉదయం 9 గంటలకు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని బి ఆర్ ఎస్ కేంద్ర పార్టీ కార్యాలయంలో 36 గంటల పాటు రైతు నిరసన దీక్ష చేపట్టబోతున్నామని రామగుండం మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరు కంటి చందర్ తెలిపారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పాల్గొంటారని మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటారని ఈ కార్యక్రమం విజయవంతం కోసం పార్టీ అధ్యక్షులు రామగుండం కార్పొరేషన్ లోని డివిజన్ ఇన్చార్జీలు కార్పొరేటర్లు,ఎంపీపీలు వైస్ ఎంపీపీలు మాజీ సర్పంచులు మండల స్థాయి అధ్యక్షులు గ్రామ కమిటీలు డివిజన్ కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు రైతు కమిటీలు రైతన్నలు పెద్దపల్లి జిల్లాలోని మంథని రామగుండం పెద్దపల్లి ప్రాంతాల్లోని ప్రతి ఒక్క బిఆర్ఎస్ సైనికుడు తరలిరావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ కార్పొరేటర్లు కృష్ణవేణి కవితా సరోజిని నాయకులు మురళీధర్ రావు పిటి స్వామి కేజీ భాష గోపు ఐలయ్య యాదవ్ జెవి రాజు బొడ్డు రవీందర్ భక్తి కిషన్ జిట్టవేణి ప్రశాంత్ జక్కుల తిరుపతి దేవరాజ్ ఆడప శ్రీనివాస్ నూతి తిరుపతి బిఆర్ఎస్ మహిళా నాయకురాలు ముద్దసాని సంధ్యారెడ్డి స్వప్న తదితరులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :