అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ● భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ ఏప్రిల్.03/ అక్షరం న్యూస్; కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా తోట మల్లేశ్వరరావు , జనరల్ సెక్రటరీగా ఎమ్మెస్సార్ రవిచంద్ర, జాయింట్ సెక్రటరీగా సందుపట్ల ప్రవీణ్ , ట్రెజరర్ గా అరకల కరుణాకర్, లైబ్రరీ సెక్రెటరీగా ఎం.డీ.సాధిక్ పాష , గేమ్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా దూదిపాల రవికుమార్, లేడీ రెప్రజెంటేటివ్ గా నల్లమల ప్రతిభ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు అవకాశం కల్పించిన సీనియర్, మహిళ, జూనియర్ న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు బాధ్యతతో బార్ అభివృద్ధికి సమిష్టిగా పాటు పడతానన్నారు.
.
Aksharam Telugu Daily