Tuesday, 14 May 2024 08:06:14 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

ప్రజా కోర్టులో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదు...

దేవుళ్లను అడ్డం పెట్టుకొని పథకాలను అమలు చేస్తామని దొంగ ఓట్లు వేస్తున్నారు... కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి గ్రామ అభివృద్ధికి నిదర్శనం... కాంగ్రెస్ పార్టీని నమ్మి గెలిపిస్తే ప్రజలను మోసం చేసింది.... రిజర్వేషన్లు కేవలం వివేక్ కుటుంబానికేనా సామాన్యులకు కాదా... మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్

Date : 28 April 2024 06:43 PM Views : 93

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 28 అక్షరం న్యూస్; ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజా కోర్టులో పరాభవం తప్పదని ప్రజలే బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్ అన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంతిని నియోజకవర్గంలోని పలిమేర్ల గ్రామంతో పాటు మహముత్తరాం మండలం బోర్లగూడెం గ్రామాలలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మొదటగా పలిమేర్ల గ్రామం వద్ద నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వారికి స్వాగతం పలికి పెద్దఎత్తున బైక్ ర్యాలీని నిర్వహించారు.అనంతరం పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ... దేవుళ్లను అడ్డం పెట్టుకొని పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దొంగ ఓట్లు వేస్తుందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి గ్రామ అభివృద్ధికి నిదర్శనమని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి గెలిపిస్తే ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర చేసి మళ్లీప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నారని అన్నారు. మన ఊరు మనబడి, కొత్త జిల్లాలు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు, రోడ్లు, తాగునీరు అన్ని సంక్షేమ పథకాలను కేసీఆర్ తీసుకువచ్చి తెలంగాణను ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పంట పొలాలకు సాగునీరు అందక పోవడం, కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ ల ఆత్మహత్యలు మొదలయ్యాయని విమర్శించారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే తెలంగాణలో సాగు నీరు అందక పోవడంతో 20 లక్షల ఎకరాల పొలాలలో ఎండిపోయాయని పేర్కొన్నారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎంతో కృషి చేశారన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు వేయమని అడగడానికి వచ్చిన సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు ఏమయ్యాయని ఎందుకు ఇవ్వడం లేదని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డీఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కనీసం ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. ఈ సమయంలో ప్రశ్నించే నాయకుడు ఎంతో అవసరమని, ప్రశ్నించే వారిపై పోలీసులతో కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.రిజర్వేషన్లను వాడుకోవడానికి, వారి ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే వివేక్ కుటుంబం రాజకీయాల్లోకి వస్తుందని కార్పొరేట్ నాయకులకు ప్రజా సమస్యలు ఏ విధంగా తెలుస్తాయని ప్రశ్నించారు. ఈ సారీ పార్లమెంటు ఎన్నికల్లో సామాన్య వ్యక్తిగా, సింగరేణి కార్మికుడిగా ఎంతో రాజకీయ అనుభవం కలిగిన తనను గెలిపిస్తే ప్రభుత్వంతో పోరాడి ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :