Wednesday, 15 May 2024 12:27:27 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

72 సింగరేణి క్వార్టర్ల కూల్చి వేసే ప్రయత్నం పై భగ్గుమన్న బాధితులు. అనధికార దౌర్జన్యంపై సింగరేణి జిఎంపై విరుచుకుపడుతున్న కార్మిక సంఘాలు.

రోడ్ల వెడల్పు పై రెండువైపులా తొలగించాలి. ఒకవైపే ఎందుకు.. ఎమ్మెల్యే వ్యవహారంపై బాధితుల నిరసన

Date : 27 March 2024 05:53 PM Views : 1008

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : . గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/మార్చి 27/అక్షరం న్యూస్: రోడ్ల వెడల్పు పేరుతో సింగరేణి కార్మికుల క్వార్టర్లు 72 కూల్చివేసేందుకు ఆర్ జీవన్ జీఎం,ఎమ్మెల్యే అనధికార దౌర్జన్యంతో రోడ్ల విస్తరణ అభివృద్ధి పేరు చెప్పి ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కుట్ర పన్నుతున్నారని హెచ్ఎంఎస్ జిల్లా అధ్యక్షుడు తోట వేణు సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్ ఎం ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల నారాయణ ఐఎఫ్టియు నాయకులు ఐ కృష్ణ ఈ నరేష్ బాధితులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా కలిసి మూడు నెలలు కాలేదు అప్పుడే అనాలోచిత నిరంకుశ ధోరణి తో రోడ్ల వెడల్పుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పట్టణాన్ని సుందరీకరించడానికి లేనిపోని అల్లర్లు సృష్టిస్తున్నారని అన్నారు.రామగుండం నగర పాలక సంస్థ చేపట్టిన గోదావరిఖని పట్టణ సుందరీకరణ రోడ్ల వెడల్పు అందరూ స్వాగతిస్తున్నారని కానీ 50 ఏళ్లుగా డిపెండెంట్ సింగరేణి కార్మికుల కుటుంబాలు 72 క్వార్టర్లలో నివాసం ఏర్పరచుకని జీవనం సాగిస్తున్నారని వాటి పక్కన ఉన్న షెడ్లను కిరాయికి ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారని నెపంతో శివాజీ నగర్ చౌరస్తాలోని క్వార్టర్లను కూల్చివేసేందుకు ఏకవాక్యం నోటీసులు అందించడం జిఎం కు అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. ఓటర్ల పక్కన షెడ్లను కిరాయిస్తున్నారని కారణంతో కార్పొరేట్ సంస్థలు కబ్జా చేసే ఆలోచనతో ఎమ్మెల్యే వ్యవహారం ఉందని దీనిలో భాగంగానే ఓల్డ్ అశోక్ థియేటర్ కూల్చివేశారని ఈ వ్యవహారం హైకోర్టులో ఉండగా ఎలాంటి నోటీసులు లేకుండా ఏకపక్షంగా కూల్చివేసారని అన్నారు దీనిని అదునుగా భావించి సింగరేణి క్వార్టర్లను కూడా కూల్చే ప్రయత్నం జరుగుతుందన్నారు జనావాసాల మీద పడి క్వార్టర్లను కూల్చివేసే కుట్ర దారుణమని వారు విమర్శించారు జీఎం తన అత్తింటి వారికి వాటర్ లను కూల్చివేసి ఆ స్థలాలను కబ్జా చేసేందుకు పెద్ద కుట్రకు తెర లేపారని అన్నారు ఆ క్వార్టర్లలో దళితులు బలహీన బడుగు వర్గాల వారు జీవిస్తున్నారని వీనల్ రెడ్డి పేరుట ఇప్పటికీ కోట్ల రూపాయలు యాజమాన్యం వసూలు చేసిందని సింగరేణి సంస్థలు ఉత్పత్తి ఉత్పాదకలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సంస్థకు పని చేసిన వారి డిపెండెంట్ ల క్వార్టర్లను కూల్చివేసే చిచ్చు పెడితే దశల వారి ఆందోళనలు తప్పవని హెచ్చరించారు వీలైతే రామగుండం కార్పొరేషన్ ఎదురుగా ఉన్న భవనాలను కూల్చివేయాలని గాంధీ మార్కెట్ కూల్చివేయాలని పోచం మైదానాన్ని,ఆక్రమించి అత్యంత ఖరీదైన భగవంతుడు నిర్మించిన వాటిని కూల్చివేయాలని జిఎం ఆఫీస్ నుండి మొదలుకొని శివాజీ నగర్ వరకు రోడ్డు ఇరువైపులా రోడ్ల వెడల్పు కోసం అన్నిటిని కూల్చివేయాలని అది చేతకాని జిఎం ఎమ్మెల్యే రామగుండం నగరపాలక అధికార యంత్రాంగం సింగరేణి పాటల మీద పడడం బలహీనులను బలహీనపరచడమేనా అని ప్రశ్నించారు పలుకుబడి ఉన్న వారిని వదిలేయడం ఇదేనా వారి నైజం అని ప్రశ్నించారు రామగుండం ఏరియా ఒకటి జిఎం ఇప్పటికైనా యూనియన్ నాయకులను 72 క్వార్టర్ల బాధితులను పిలిపించి చర్చలు జరిపి శాంతియుతం గా పరిష్కారం చేయాలని లేని పక్షంలో ఆందోళనలను తప్పవని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో హెచ్ఎంఎస్ జిల్లా అధ్యక్షుడు తోట వేణు రాష్ట్ర అధ్యక్షులు జక్కుల నారాయణ సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు టి రాజారెడ్డి ఐఎఫ్టియు నాయకులు ఐ కృష్ణ నరేష్ 72 క్వార్టర్ల బాధితులు నంబయ్య రమేష్ మాజీ కౌన్సిలర్ తోట అనసూయ 200 మంది పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :