అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/తల్లాడ ఏప్రిల్ 6 (అక్షరంన్యూస్) అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం తల్లాడలో కొద్దిసేపు సేద తీరారు. తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు వెళుతున్న ఆయన మార్గమద్యలోని తల్లాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల రాము ఇంటి వద్ద ఆగారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ బ్రేక్ ఫాస్ట్ చేసి హైదరాబాద్ వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మలపల్లి రమేష్, ఐనాల నరసింహారావు, గోగినేని తిరుమలరావు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు వారు కూడా బహిరంగ సభకు వెళ్ళనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.
.
Aksharam Telugu Daily