అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ ఏప్రిల్ 5 (అక్షరంన్యూస్) జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఆత్మ కమిటీ డైరెక్టర్ నున్నా రామకృష్ణ జన్మదిన వేడుకలను శుక్రవారం తల్లాడలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా నాయకులు అడపా అనిల్ చౌదరి ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన జన్మదిన వేడుకల కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం అనిల్ చౌదరి మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందటానికి రామకృష్ణ చేసిన సేవలను వివరించారు. ఆయన రానున్న రోజుల్లో ఉన్నత పదవులను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల రాము, వేమిశెట్టి నున్న రామారావు, వారాల అజయ్, నున్న వెంకటేశ్వరరావు, ప్రకాష్, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily