Tuesday, 14 May 2024 06:01:56 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ ను గెలిపించండి

.

Date : 27 April 2024 08:56 PM Views : 118

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/కమాన్ పూర్ : పెద్దపల్లి/ కమాన్పూర్/ ఏప్రిల్ 27/ అక్షరం న్యూస్: నిరాడంబరుడు, నిస్వార్ధ సేవాపరుడుయైన బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థియైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అత్యధిక మెజారిటితో గెలిపించాలని కమాన్ పూర్ మండల బీఆర్ఎస్ పార్లమెంట్ ప్రచార కమిటీ సభ్యులు కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ తగ్గలేదని, ప్రచార పర్వంలో ప్రజల నుండి లభిస్తున్న స్పందనే ఇందుకు నిలువెత్తు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ పార్టీ కారు లోడుగానే ఉందని ఎప్పటికి ఖాళీ కాదని గుర్తుంచుకోవాలని ఇతర రాజకీయ పార్టీలకు సూచించారు. బీఆర్ఎస్ పార్టీ గత పడేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపుకు దోహదపడుతాయన్నారు. కాంగ్రెస్ నాయకులు కొందరు అసభ్యకర పదజాలంతో మా నాయకులపై అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లేని యెడల అదే దొరనిని తాము అవాలంభించాలిసి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కస్టపడి పనిచేసే ఎంతో మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నప్పటికీ దశాబ్దాల కాలంగా ఒకే కుటుంబానికి మాత్రమే ఎంపీ టికెట్ను కేటాయిస్తూ కష్టపడ్డ వారిని విస్మరిస్తుందని ఏద్దేవా చేశారు. మండలంలో ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మెజార్టీ లభించడం తద్యమన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలకు మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన హామీలు అమలు పరిచకుండా దాటవేసే దొరనిని అవలంబిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి రాచకొండ లక్ష్మీరవి, వైస్ ఎంపిపి ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, మాజీ జడ్పిటీసి మేకల సంపత్ యాదవ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ బాద్రపు మల్లేష్, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, మాజీ సర్పంచులు తాటికొండ శంకర్, కొండ వెంకటేష్, ఆకుల గట్టయ్య, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు బొమ్మగాని అనిల్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ లు పోలుదాసరి సాయి కుమార్, జాబు సతీష్, నాయకులు రాచకొండ రవి, నీలం శ్రీనివాస్, బొల్లపెల్లి శంకర్ గౌడ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :