Tuesday, 14 May 2024 05:31:46 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

బ్రేకింగ్ న్యూస్ అటవీ జంతువులను వేటాడుతుండగా పట్టుబడ్డ ఆరుగురు వేటగాళ్లు ...

వేటగాళ్ల నుండి బలమైన మారణ ఆయుధాలు స్వాధీనం.. గన్ను, కత్తి, గొడ్డలి, బుల్లెట్, కారుతో పాటు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం.. కేసు నమోదు చేసి కోర్టుకు తరలింపు ... తల్లాడలో విలేకరుల సమావేశంలో జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్

Date : 07 April 2024 08:47 PM Views : 450

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ ఏప్రిల్ 7 (అక్షరంన్యూస్) అటవీ జంతువులను వేటాడుతుండగా కొంతమంది వేటగాళ్ళను కాపు కాసి పట్టుకున్నట్లు జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా తల్లాడలో డీఎఫ్ వో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తల్లాడ రేంజర్ పరిధిలోని చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు బీటు పరిధిలోని అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి కొంతమంది వేటగాళ్లు జంతువులను వేటాడుతుండగా పట్టుబడ్డారని వివరించారు. ఉన్నతాధికారుల విశ్వసనీయ సమాచారం మేరకు బెండలపాడు అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వచ్చారనే సమాచారంతో జిల్లా, తల్లాడ రేంజ్ పరిధిలో అధికారులు ఆ వేటగాళ్ళ కోసం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆంధ్రకు చెందిన హైదరాబాద్ లో ఉంటున్న నలుగురు వేటగాళ్లతోపాటు మరో ఇద్దరు స్థానికులను అరెస్టు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన పుష్పాల సుగ్రీవు, వెంకట శ్రీకాంత్, బొడ్డన నారాయణరావు, తినురం విజయ్ నాగరాజు తో పాటు స్థానికులు డేరంగుల మిధున్ కుమార్, బొర్రా సురేష్ లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుండి గన్ను, కత్తి, మల్టిపుల్ గొడ్డలి, బుల్లెట్, కారు, ఆరు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ అటవీ ప్రాంతంలో జింకలు, చిరుత పులి తదితర అటవీ జంతువులు ఉంటాయని, వాటిని వేటాడేందుకు వచ్చినట్లు తెలిపారు. వీరికి మూడు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకొని కోర్టుకు రిమాండ్ చేయనున్నట్లు వెల్లడించారు. వేటగాళ్లు వస్తున్నారనే సమాచారంతో శని, ఆదివారాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ చేయటం జరుగుతుందని తెలిపారు. లోకల్ గా ఉండే వారు కాకుండా హైదరాబాదు నుండి వేటగాళ్లు వస్తున్నారని వారిని పట్టుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అటవీ జంతువులను వేటాడితే కఠిన శిక్షలు పడతాయని హెచ్చరించారు. ఈ అటవీ ప్రాంతంలో నిరంతరం గస్తీ ఏర్పాటు చేస్తున్నామని, ఎవరూ కూడా వన్యప్రాణులను వేటాడవద్దని సూచించారు. ఈ సమావేశంలో సత్తుపల్లి రేంజర్ లావణ్య, డిఆర్ఓ కెవి రామారావు, తల్లాడ రేంజ్ పరిధిలోని అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :