Tuesday, 14 May 2024 09:59:10 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

కొత్తగూడెం ఈద్గా మరియు స్మశాన వాటిక (ఖబ్రస్థాన్) అడక్ కమిటి ఏర్పాటు

అడక్ కమిటి అధ్యక్షుడిగా మహ్మద్ గౌస్, ఉపాధ్యక్షుడిగా ఉమర్ ఫారూఖ్ ను నియమిస్తూ వక్ఫ్ బోర్డ్ ఉత్తర్వులు జారీ

Date : 07 April 2024 11:05 AM Views : 112

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ● భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం/ ఏప్రిల్.06/ అక్షరం న్యూస్ : కొత్తగూడెం ఈద్గా మరియు ఖబ్రిస్థాన్ కు హడహక్ కమిటీ ని తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అడక్ కమిటి అధ్యక్షుడిగా మహ్మద్ గౌస్ మోహినుద్దీన్ , ఊపాఅధ్యక్షుడిగా ఉమర్ ఫారూఖ్ మరియు ఇరవై ఆరు మంది సభ్యులను నియమిస్తూ వక్ఫ్ బోర్డు సిఇఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా అడహాక్ కమిటి అధ్యక్షులు మహ్మద్ గౌస్ మోహినుద్దీన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగ ఈ సంవత్సరం కూడా ఈద్గా లో నమాజ్ నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అని, ఈద్గా లో నమాజ్ కువచ్చే ముసల్లిలకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చెస్తున్నామని తెలిపారు. కొత్తగూడెం ఈద్గా లో రంజన్ పండుగ నమాజ్ ఉదయం 9:00 గంటలకు ప్రారంభం అవుతుందని ,పండుగ నమాజ్ ఆచరించేందుకు వచ్చే ముసల్లిలు తమవెంట జానీమాజ్లు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు యంఏ. రజాక్, అన్వర్ పాషా, ఖమర్, యఖుబ్ ఖాద్రీ, మహబూబ్ ఖాద్రీ, సయ్యద్ యఖుబ్ ఉద్దీన్, మహ్మద్ హుస్సేన్ ఖాన్, మహ్మద్ అక్తర్ పాషా, అమీర్ ఖాద్రీ, బషీర్, హైమద్, తదితరులు పాల్గొన్నారు. ● కొత్తగూడెం ఈద్గా మరియు ఖబ్రస్థాన్ స్మశాన వాటిక కమిటీల నియామకంలో మితిమీరిన రాజకీయ పార్టీల జోక్యం ● రాజకీయ పార్టీల జోక్యం పై అసహనం వ్యక్తం చేస్తున్న ముస్లిం మత పెద్దలు ,రాజకీయ విశ్లేషకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ని కొత్తగూడెం పట్టణ ఈద్గా మరియు ఖబ్రస్థాన్ తెలంగాణ వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉండడంతో ఇక్కడ కమిటీలు వేయడం ఎప్పుడు తలనొప్పిగానే మారింది. ఇక్కడ కమిటీ ల విషయంలో రాజకీయ పార్టీల జోక్యం మితిమీరి పోతోందని ముస్లిం సంఘాలు ,మత పెద్దలు ,రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉన్న స్థలాలకు అన్ని జమాత్ ల మత పెద్దలను కలిపి ఒక కమిటిగా వేయాల్సి ఉండగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనం కోసం తమ పార్టీ నాయకులను కమిటీ బాద్యులను చేసి కమిటీలు వేస్తున్నారని మొదటి నుంచి ముస్లిం లలో రాజకీయ పార్టీల పట్ల అసహనం నెలకొని ఉంది ... కాగా ఈసారి వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉన్న ఆధ్యాత్మిక స్థలాలకు కమిటీలు వేసే క్రమంలో నియోజకవర్గానికి చెందిన సీపీఐ పార్టీ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు మరియు కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పొందేం వీరయ్య ల లెటర్ హెడ్ ల మీద తమ అభ్యర్థులకు కమిటీ ఇవ్వాలని పోటా పోటీగా వక్ఫ్ బోర్డుకు పైరవీలు చేయడం కొత్తగూడెం నియోజకవర్గ ముస్లిం సంఘాలలో చర్చనీయాంశంగా మారింది. ఇలా ఆధ్యాత్మిక ప్రదేశాలలో స్థానికులు ,స్థానికేతరులు ఎవరో తెలుసుకోకుండా రాజకీయ పార్టీల నాయకులు తమ రాజకీయ స్వలాభం కోసం తమ పార్టీ అనుకూల వ్యక్తులకు కమిటీలు ఇప్పించడం పై ప్రజల్లో అసహనం, వ్యతిరేకత నెలకొంటుందని రాజకీయ పార్టీల నాయకులు గుర్తించక పోవడం శోచనీయమని పలువురు మత పెద్దలు భావిస్తున్నారు. ఇక ఈద్గా వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉండడంతో ఇక్కడ నమాజ్ చదివించే ఇమామ్ లేదా స్థానిక ప్రభుత్వ ఖాజీ వక్ఫ్ బోర్డ్ నుంచి నియమితులైన వారవడం వల్ల నమాజ్ చదివించే ఆనవాయితీ ఉంది .ఈ సారి ఇలా జరుగుతుందా లేదా అనేది చూడాలని ముస్లిం మతపెద్దలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :