Tuesday, 14 May 2024 07:37:54 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

కాంగ్రెస్,బిజెపి రెండు ఒకటే..వారికి ఓటేస్తే ఆగమే

అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. -కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచింది. -పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.

Date : 23 April 2024 07:15 PM Views : 201

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్/సంగెం : . - వరంగల్ జిల్లా /సంగెం /ఏప్రిల్ 23/అక్షరం న్యూస్. కాంగ్రెస్,బిజెపి రెండు పార్టీలు ఒకటేనని,ఆ పార్టీలకు ఓటువేస్తే ఆగమేనని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం సంగెం మండలం ఎల్గురు రంగంపేట, ఏల్గురు స్టేషన్, నర్సానగర్,బిక్కోజినాయక్ తండ,తిమ్మాపూర్,గాంధీనగర్,కొత్తగూడెం,తీగరాజుపల్లి,సోమ్లతండ,గవిచర్ల, షాపూర్,లోహిత, పెద్దతండ,రామచంద్రాపురం,ఆశాలపల్లి,కాపులకనపర్తి,గుంటూరుపల్లి గ్రామాలలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ..మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజాపాలనను విస్మరించిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకొని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి యొక్క అభివృద్ధికి కృషి చేసిందన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచిందని విమర్శించారు. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేస్తూ మరో సారి ప్రజలను మోసం చేయడానికి సిఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. డిసెంబర్ చివరి వారంలో ఇవ్వాల్సిన రైతుబంధు నిధులే ఇప్పటికీ ఇవ్వలేదు,15 వేల రూపాయల కౌలు రైతులకు ఇస్తానని ఇవ్వలేదు,12000 రైతు కూలీలకు ఇస్తానని ఇవ్వలేదు,4వేల పెన్షన్ అమలు లేదు,వడ్లకు 500 బొనస్ లేదు,మహిళలకు నెల నెలా ఇస్తానన్న 2500 ఆర్థిక సహాయం లేదు, 500 గ్యాస్ సిలెండర్ సబ్సిడీ పూర్తిగా అమలు చేయలేదు,విద్యార్థులకు 5లక్షల భరోసా కార్డులు ఇవ్వలేదు,5లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు,ఉచిత 200 యూనిట్ల విద్యుత్ పథకం సగం మందికి అమలు కాలేదు ఇలా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని కాంగ్రెస్ మళ్ళీ నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్నారు.కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త మండలాలు, నియోజకవర్గాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకొని ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ప్రజలను ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఇది ఇలా ఉంటే నష్టపోయిన రైతులను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కసారి అయిన కలసి వారికీ మద్దతు తెలిపారా..ఎండిపోయిన పంటలను పరిశీలించారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని వర్గాలకు అభివృద్ధి చేసారని అన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని ప్రజలకు చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జడ్పిటిసి గూడా సుదర్శన్ రెడ్డి, పసునూరి సారంగపాణి, దోపతి సమ్మయ్య, జక్క మల్లయ్య, తదితర మండల నాయకులు, పాల్గొన్నారు

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :