అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/మార్చి 25/అక్షరం న్యూస్: రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సోమవారం హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు రామగుండం సీపీ ఎం శ్రీనివాసులు ఐపిఎస్., (ఐజి) హోలీ వేడుకల్లో పాల్గొని పోలీస్ అధికారులు సిబ్బందితో హోలీ ఘనంగా జరుపుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలకు పోలీస్ అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,(ఐజి) శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ వేడుకలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.రంగులు చల్లుకునే సమయం లో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ హోలీ పండుగ ప్రజలందరి జీవితాలలోసంతోషాన్ని నింపి,రంగులమయం చేయాలని సీపీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో హోలీ సంబరాల్లో పాల్గొని పోలీస్ అధికారులకు సిబ్బంది ఒకరికి ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్ ఐపిఎస్.,పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ ,గోదావరిఖని ఏసిపి ఎం.రమేష్,జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు,మంచిర్యాల ఏసిపి ఆర్.ప్రకాష్,ఏ ఆర్ ఎస్ సి పి సురేంద్ర,కమిషనరేట్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు,రామగుండంకమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం,సిబ్బంది పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily