అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/తల్లాడ ఏప్రిల్ 4 (అక్షరంన్యూస్) తల్లాడ మండలంలో అన్ని గ్రామ పంచాయతీల సెక్రటరీలకు గురువారం ఎంపీడీవో చంద్ర మౌళి మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ వేసవికాలంలో ఉపాధి హామీ పనులు చేపడుతున్న కూలీలకు మెడికల్ కిట్లను అందించాలని సూచించారు. ఎండా వేడిమిని తట్టుకునేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని, అవసరమైతే మెడికల్ కిట్లను పంపిణీ చేయాలన్నారు. తొలుత కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉపాధి హామీ పథకం అమలు తీరుపై ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో కొండపల్లి శ్రీదేవి, ఏపీవో కోటయ్య, కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily