Wednesday, 15 May 2024 03:01:38 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

రాములవారి కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబు రేపు సీతారాముల కళ్యాణం

కళ్యాణ తంతు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై 12.30 గంటలకు ముగుస్తుంది. భద్రాద్రికి పోటెత్తిన భక్తజనం పట్టువస్త్రాలు సమర్పించనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

Date : 16 April 2024 06:12 PM Views : 273

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం/ ఏప్రిల్ 16 /అక్షరం న్యూస్ : రాములోరి కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబు అయింది. దక్షిణ అయోధ్య భద్రాచలం పుణ్యక్షేత్రంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు సీతారాముల కళ్యాణం మిథిలా స్టేడియంలోని శిల్పకళా శోభిత కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరగనుంది. కళ్యాణ తంతు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై 12.30 గంటలకు ముగుస్తుంది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరపున స్వామి వారి కళ్యాణానికి ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మంగళవారం మధ్యాహ్నమే ఆమెభద్రాచలం చేరుకున్నారు. ఈసారి కళ్యాణం తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు భద్రాద్రి తరలి వస్తారని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖలు కలిపి సుమారు 1500 మంది సిబ్బంది కళ్యాణ విధులు నిర్వహిస్తున్నారు. చలువ పందిల్లు, చాందిని వస్త్రాలు, రంగు రంగుల విద్యుత్ దీపాలు, స్వాగత ద్వారాలతో భద్రాద్రి క్షేత్రంను అలంకరించారు. ముఖ్యంగా భక్తులకు వసతి, తాగునీరు, పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎండోమెంట్, సమాచార కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ ప్రియాంక అలా, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్, ఎస్పీ రోహిత్ రాజ్, రామాలయం ఈఓ రమాదేవి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం స్వామి వారి కళ్యాణం టికెట్లు దేవస్థానం సీఆర్ కార్యాలయం, భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. అలాగే ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. స్వామి వారి తలంబ్రాలు, ప్రసాదాలు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు, అత్యవసర చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలకు ప్రత్యేకంగా బెడ్లు అందుబాటులో ఉంచారు. కళ్యాణం తిలకించడానికి మండపాన్ని 24 సెక్టార్లుగా ఏర్పాటు చేశారు. ప్రతి సెక్టార్ కు ప్రత్యేక అధికారులను నియమించారు. అలాగే భద్రాచలం వచ్చే భక్తులకు సమాచారాన్ని అందించేందుకు 25 ప్రాంతాల్లో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవలు అందించడానికి 10 అత్యవసర కేంద్రాలతో పాటు 5 అంబులెన్స్ లను అందుబాటులో ఉంచారు. స్వామివారి తలంబ్రాలు పంపిణీకి 60 కౌంటర్లు, ప్రసాదాలకు కౌంటర్లు 19 ఏర్పాటు చేశారు. టీఎస్ఆర్టీసీ ద్వారా అదనపు బస్సులు నడుపుతున్నారు. స్వామి వారి కళ్యాణం, పట్టాభిషేకం తిలకించడానికి వచ్చే భక్తుల కోసం మినీ బస్సులు, బ్రిడ్జి పాయింట్ బస్టాండ్ నుండి ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కు అవాంతరం ఏర్పడకుండా పట్టణంలోని పలు ప్రాంతాలలో వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు. భక్తుల ఇంటివద్దకే తలంబ్రాలు పంపిణీ చేయడానికి టీఎస్ఆర్టీసీ, పోస్టల్ శాఖలు ముందుకు వచ్చాయి. గురువారం మహా పట్టాభిషేకం బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణం జరిగిన మరుసటి రోజు గురువారం శ్రీ స్వామి వారికి కళ్యాణం జరిగిన వేదిక పైనే మహా పట్టాభిషేకం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. పట్టాభిషేకం కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :