Tuesday, 14 May 2024 09:38:56 PM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

నాగూర్ల వెంకన్న మీద అబండాలు వేయడం సమంజసం కాదు..

నాగూర్లపై ఆరోపణలు నిరాధారం... -చిట్ ఫండ్ కంపెనీ తో నాగుర్లకు సంబంధం లేదు. -బాపురావును పరామర్శించిన ఆరే సంక్షేమ సంఘ నాయకులు.

Date : 07 April 2024 06:34 PM Views : 201

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్/సంగెం : - వరంగల్ జిల్లా /సంగెం /ఏప్రిల్ 07/అక్షరం న్యూస్. సమాజంలో మంచి పేరున్న నాగూర్ల వెంకటేశ్వర్లు పై సోమనాథ్ చిట్ ఫండ్ యజమాని బాపూరావు అబాండాలు వేయడం సమంజసం కాదని ఆరే సంక్షేమ సంఘ నాయకులు చెట్టుపల్లి శివాజీ అన్నారు. ఆదివారం ఆరే సంక్షేమ సంఘం, ఉద్యమకారుల ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని స్వర్ణ గార్డెన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆరే సంక్షేమ సంఘం నాయకులు ఉద్యమకారులు పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో మోర్తాల చందర్రావు మాట్లాడుతూ సోమనాథ్ చిట్ ఫండ్ యజమాని బాపూరావు ఆత్మహత్య ప్రయత్నం చేయడం బాధాకరమని ఆయనను మా ఆరే సంక్షేమ సంఘం తరఫున పరామర్శించడం జరిగిందని తెలిపారు. నిజా నిజాలు తెలుసుకొని విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ ఆత్మహత్య ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు. ఈరోజు కుటుంబ సభ్యుల ద్వారా తెల్సిన సమాచారం ఏమంటే సోషల్ మీడియాలో బాపూరావు పెట్టిన వీడియోలన్నీ పాతవి అని, వాటిని ఇప్పుడు సందర్భానుసారం వాడుకొని సానుభూతి పొందేందుకు ప్రయత్నించారని అన్నారు. చిట్ ఫండ్ నుండి నాగూర్ల వెంకటేశ్వర్లు బయటకు వచ్చినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని గుర్తు చేశారు. బాపురావు ఆర్థికంగా దెబ్బతింటే ఆయన తన భార్యతో నాగూర్ల వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి బ్రతిమాలితే తనకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు తప్ప వీరిద్దరి మధ్య ఎటువంటి లావాదేవీ లేవని ఏమైనా లావాదేవీలు ఉంటే బాపురావు ఖాతాదారుల మధ్య మాత్రం ఉన్నదని అన్నారు. బాపురావు 46 మంది సభ్యులకు కోటి 90 లక్షల చెల్లించాల్సి ఉంది. దానికై నాగూర్ల పెద్దమనిషిగా మాట్లాడడే తప్ప బాపురావును బెదిరించలేదని తెలిపారు. బాపురావు జీరో పెట్టుబడితో వచ్చినట్లు నాగూర్ల వెంకటేశ్వర్ పై ఆరోపణ చేయడం తప్పు అని వెంకన్న పూర్తిగా డబ్బులు చెల్లించే కంపెనీలో భాగస్వామి అయినాడని తాను భాగస్వామ్యం విరమించుకున్నప్పుడు బాపూరావు డబ్బులు చెల్లించాడని తెలిపారు. బాపురావు ఆరోపించినట్లు ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఉన్నా ప్లాట్, గోవర్ధన్ దగ్గర నుండి 2400 గజాల భూమి, ఇంకా ఏ ఇతర ఆస్తులైన వెంకన్నకు ఇచ్చినవి కాదని అది బాపూరావు తన ఖాతాదారులకు చెల్లించేందుకు మాత్రమే వెంకన్న కు ఇచ్చాడని తెలిపారు. త్వరలో బాపూరావుతో ఇరు వర్గాల సమక్షంలో మాట్లాడి ఖాతాదారులకు న్యాయం జరిగే విధంగా చూద్దామని తెలిపారు. జెండా రాజేష్ మాట్లాడుతూ రాజకీయ ఎదుగుతున్న నాగూర్ల పై బాపూరావు అబండాలు వేయడం సరైనది కాదని, రాజకీయంగా నాగూర్ల వెంకటేశ్వర్లు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని గుర్తు చేశారు. నాగూర్ల వెంకటేశ్వర్లు నమ్మిన వారికి న్యాయం చేసేందుకే బాపురావుతో మాట్లాడరే తప్ప బాపురావుకు కూడా న్యాయం జరిగే విధంగా వెంకటేశ్వర్లు ప్రయత్నించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అరే సంక్షేమ సంఘం నాయకులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :