Tuesday, 14 May 2024 03:40:12 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

నమ్మిన ప్రజలు తప్పు కాదు ..నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీది తప్పు ..బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్

.

Date : 16 April 2024 08:03 PM Views : 691

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 16 అక్షరం న్యూస్! ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎంతో నమ్మి అధికారం కట్టబెడితే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని పెద్దపల్లి భారత రాష్ట్ర సమితి పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తుజమెత్తారు. ఇందులో ప్రజల తప్పు ఏమాత్రం లేదని, తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మంథని నియోజకవర్గ స్థాయి భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని రానున్న పార్లమెంటు ఎన్నికలపై పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, ఎవరు ఉన్నప్పుడు చేసిండ్రు అని ప్రజల గమనిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ చరిత్ర గల పార్టీ, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ అని, మనం తెలంగాణ సాధించిన వాటిలో ఉన్నాం, అన్ని వర్గాలను ఆదుకున్న పార్టీ, వర్గాలను పార్టీ, ప్రజల గుండెల్లో నిలిచిపోయిన, ప్రజలకు అభివృద్ధి చేయడం గురించే ఆలోచించిన పార్టీ తెలంగాణ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలల్లో ప్రజల కు ఏం చేసిందో ప్రజలకు అర్థం అయింది, అందుకే గ్రామాల్లో అందరూ కెసిఆర్ గుర్తు వస్తున్నాడని నమ్మిన ప్రజలు తప్పు కాదు, నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీది తప్పు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు ఆర్టీసీ బకాయి పడ్డ సంస్థ, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆర్టీసీ ని నిధులు కేటాయించి అభివృద్ధి దిశగా తీసుకెళ్లారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ వాళ్లలో ఉచిత ప్రయాణం అనే పదం పెట్టి, మళ్లీ నష్టాల్లోకి తోసేసిందన్నారు. ఉద్యోగాల పేరిట మెగా డీఎస్సీ అని మోసం చేసి, 200 రూపాయల ఫీజు ని, 1000 రూపాయిలు చేసి నిరుద్యోగులను, మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు, అపాయింట్ మెంట్ ఆర్డర్ కాపీలను ఇచ్చి తామే ఉద్యోగాలు ఇచ్చినట్లుగా పత్రికలలో వేయించుకుంది రేవంత్ రెడ్డి సర్కారును ప్రజలు గమనిస్తున్నారన్నారు. 25,00 జీవన భృతి, కళ్యాణ లక్ష్మీ తో పాటు తులం బంగారం ఇస్తా అని నమ్మించి మహిళలను, ఋణ మాఫీ అని రైతులను, 1.వ తారీకు నా జీతాలు అని ఉద్యోగులను మోసపూరిత వాగ్దానాలతో మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. కెసిఆర్ 10 సంవత్సరాల పాలనలో ఒక్క పొలం ఎండిపోలేదు.. కరోనా సమయం లో రైతులు ఇబ్బంది పడొద్దని రైతు బంధు వేసిన ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో పంటలు ఎండిపోయి ఎక్కడ ఎండిపోయిన అని మాట్లాడుతున్నారు. ఒక్క రైతులు ఇబ్బంది పడకుండా నిర్వహణా చేసింది కెసిఆర్ కాదా అని ఆయన ప్రశ్నించారు. అప్పుడు డిసెంబర్ 9 అని, ఇప్పుడు ఆగస్టు అని ముఖ్యమంత్రి చేసుకున్నాడని, అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు తీసుకుంటే 2000 ఫించన్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వేస్తే 4000 ఫించన్ అన్నాడు మరి ఏడపాయే.. కాంగ్రెస్ పార్టీ గెలిచింది..అబద్దాలతోనే అని తేలిపోయిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి.. వలస పక్షులు వస్తాయి పోతాయని ఓటర్లు గుర్తించి తగిన నాయకుని ఎన్నుకోవాలని సూచించారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ఒకే కుటుంబానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ... ఈ కుటుంబానికి చెందిన వాళ్లు ఎక్కడి నుండి వచ్చారు, కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. వాళ్ళు హైదరబాదీయులు వాళ్ళకు ఇక్కడి ప్రజలపై పట్టింపు ఉండదు.. వీళ్ళు గెలిస్తే హైదరాబాద్ లోనే ఉంటారని, అదే కొప్పుల ఈశ్వర్ గెలిస్తే ఈ ప్రాంతం బిడ్డ ఇక్కడే ప్రజల మధ్య ఉండే నాయకుడని ప్రజలు గుర్తించాలన్నారు. కాంగ్రెస్ చెందిన అభ్యర్థి గెలిస్తే హైదరాబాద్ కార్పోరేట్ ఆఫీసుల్లో ఉంటాడు.. వీకెండ్ కు ఒక సారి వస్తాడు..డబ్బు సంచులతో వచ్చి గెలిస్తే.. ఇక్కడ ప్రజలపై ఆరాటం ఉండదని.. పేర్కొన్నారు 100 కంపెనీ, వేల కోట్ల ఉన్న వీళ్ళ కుటుంబం ఈ ప్రాంతం లో గెలిచి, ప్రజల కు ఏం చేసారుని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దళితులను మోసం చేసిన పార్టీ.. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మూడు ఎస్సీ పార్లమెంటు స్థానాలు ఉంటే రెండు మాదిరిగా సామాజిక వర్గాలకు, ఒకటి మాల సామాజిక వర్గానికి ఇచ్చిందని, కాని కాంగ్రెస్ మాదిరి సామాజిక వర్గాన్ని అవమానిచింది కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజలు మార్పు కోరారు.. ఇప్పుడు బాధపడుతున్నారు... పెద్దపల్లి జడ చైర్మన్ పుట్ట మధుకర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహార శైలి చూస్తే డిల్లీ నుంచి గల్లీ దాకా ఒకేలా ఉంది, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఒకే కుటుంబానికి చెందిన వారికి 3 సీట్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ.. ఇదేనా మీ ఉదయపూర్ డిక్లరేషన్ అని పెద్దపల్లి జెడ్పిటి చైర్మన్ పుట్ట మధుకర్ ప్రశ్నించారు. డిసెంబర్ 9 రుణమాఫీ ఇస్తారు రుణమాఫీ రాలేదు కాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 4 నెలల పాలనలో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి.. రైతులను చూస్తే గుండె తరుక్కుపోతుందని అన్నారు.. కొప్పుల ఈశ్వర్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాదాసీదా ఉండే నాయకుడు.. ఓ మాజీ సింగరేణి బొగ్గు కార్మికుడు.. ఎంపీ గా గెలిస్తే ఈ ఏడు నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరుగుతుందని దీనిని ప్రజలు గుర్తించి కొప్పుల ఈశ్వర్ నువ్వు భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :