Tuesday, 14 May 2024 02:00:56 AM
 Breaking
     -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..      -> ఓటు వేయడం మీ బాధ్యత ...అది మీ ఆయుధం జమియా మస్జిద్ ఇమాం : ముఫ్తి యాకుబ్ ..      -> జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 2072 ర్యాంకు సాధించిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శరత్ తేజ పదిమందికి పైగా ఆల్ ఇండియా 20 వేల లోపు ర్యాంకులు.....      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన ఎస్ ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు :..      -> నడిబొడ్డున అక్రమ నిర్మాణం....-చోద్యం చూస్తున్న మున్సిపల్ అదికారులు....      -> "రండి ! పండుగ ఆనందం కలిసి పంచుకుందాం. "......      -> "యౌమ్ అల్ ఖుద్స్ "సందర్భంగా ఈద్గా ల వద్ద ఎస్.ఐ.ఓ వినూత్న ప్రదర్శన..      -> ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు : ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆలయ ఈఓ పై జిల్లా పాలనాధికారికి పిర్యాదు ..

బాధితుల పిర్యాదులకు వెంటనే స్పందించాలి. ఫోక్సో, ఎస్ సి/ఎస్ టి కేసులలో త్వరితగతిన ఛార్జ్ షీట్ వేయాలి.

నేరస్థులకు శిక్ష పడే విధంగా చేసి కన్వెన్షన్ రేట్ పెంచాలి: పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,

Date : 30 March 2024 08:12 PM Views : 384

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/గోదావరిఖని : గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/మార్చి 30/అక్షరం న్యూస్: సాంకేతిక పరిజ్ఞానం,శాస్త్రియ పరిశోధనతో సమగ్ర విచారణ చేపట్టి నేరాల నియంత్రణ చేసి చట్టపరంగా సమగ్ర సాక్ష్యాధారాలతో నేరస్థులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలి అని అధికారులకు రామగుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్ (ఐజీ) సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోనీ డీసీపీ లు, ఏసీపీ లు, సీఐ, పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ అధికారులతో శనివారం కమీషనరెట్ కార్యాలయంలో యు ఎల్ కేసులు, గ్రేవ్ యు ఎల్ లాంగ్ పెండింగ్‌లో కేసుల పరిష్కారం, ఎస్ సి/ఎస్ టి/యు ఎల్ కేసులు,విమెన్ ఎగైనెస్ట్ కేసులు,ఫోక్సో కేసుల పరిష్కారం,ఎన్డిపీఎస్ N యాక్ట్ కేసుల,ఎన్హెచ్ఆర్సి,ఎస్హెచ్ఆర్సి మహిళా కమిషన్‌ కు సంబంధించిన అప్పీల్ పిటిషన్ పెండింగ్ పై సమీక్షా నిర్వహించారు. ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు.పోక్సో,ఎస్సీ,ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ 60 రోజులలో పూర్తిచేసి కోర్ట్ లో చార్జిషీట్ వేయాలని సూచించారు.ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం,శాస్త్రియ ఆధారాలతో దర్యాప్తు చేయాలి తద్వారా చట్టపరిధిలో నిందితులకి కఠినమైన శిక్షలు పడేలా చూడాలని అన్నారు. బాధితుల పిర్యాదులకు, ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి. ఓల్డ్ పెండింగ్ ఉన్న కేసులలో ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తిచేసి త్వరగా డిస్పోజల్ చేయాలని లాంగ్ పెండింగ్ ఉన్న కేసులను రివ్యూ నిర్వహించి సంబంధిత అధికారులకు తగు సూచనలు సలహాలు చేశారు. ప్రతి సిడిపై లో ప్లాన్ అఫ్ యాక్షన్ ఉండాలని తెలిపారు. పెండింగ్ ఉన్న నాన్ బేలబుల్ వారెంట్స్ వెంటనే ఎగ్జిక్యూట్ చేయాలి. అదేవిధంగా రాబోయే ఎన్నికల సందర్భంగాపోలీసులు అందరూ ఎన్నికల సంఘం నియంత్రణలొ,పర్యవేక్షణ, క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు.ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించడానికి అధికారు లందరూ సమిష్టిగా విధులు నిర్వహించాలి.ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల సంఘం సూచనల ప్రకారం బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలియజేసారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక వ్యక్తుల,రౌడీషీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో భరోసా కల్పించే విధంగా పనిచేయాలని తెలిపారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అక్రమ మధ్యo,నగదు రవాణాను నిరోధించడంలో భాగంగా చెక్ పోస్ట్ లలో విధులు నిర్వర్తించే సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. అలాగే సరి హద్దు రాష్ట్రాల పోలీస్ అధికారులతో కాంటాక్ట్ లో ఉంటూ అక్రమ రవాణాను సంబందించిన సమచారం షేర్ చేసుకోవాలని, సరైన ఆధారాలు లేకుండా ఎవరైనా పరిమితికి మించి నగదును రవాణా చేస్తూ పట్టుబడితే ఎన్నికల నియమావళి ప్రకారం కేసుల నమోదు చేసి సీజ్ చేసిన నగదును సంబందిత శాఖా వారికీ అందచేయాలని తెలిపారు. ఎన్నికల సందర్భంగా మధ్యం,నగదు అక్రమ రవాణజరగకుండా ప్రత్యేక గస్తీ నిర్వహించి నిఘా ఉంచాలని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ బాగా చేయాలని సూచించారు. ఈ సమావేశం లో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్., మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ఐపిఎస్., అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ,మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్ ,జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు,బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్,టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, సిసిఎస్ ఏసీపీ వెంకటేశ్వర్లు,ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఏ ఆర్ ఏసీపీ సురేంద్ర, కమీషనరేట్ పరిధిలోని సీఐ, ఎస్ఐ లు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :