అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : - చొప్పదండి/ కరీంనగర్,ఏప్రిల్ 28 (అక్షరం న్యూస్ ) కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాంబయ్యపల్లె మాజీ ఉపసర్పంచ్ అనిల్, మల్లన్నపల్లె బీఆర్ఎస్ నాయకులు బండారి రవి, బండారి సంపత్ లు ఆదివారం రోజు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరినారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని అన్నారు.
.
Aksharam Telugu Daily