Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /ఆగస్ట్ -02(అక్షరం న్యూస్ ) వాహనదారులు రోడ్డు నిబంధనలను పాటించాలని, ప్రయాణ సమయాల్లో వాహన దారులు సరైన ధ్రువ పత్రాలు కలిగి ఉండాలని సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి వాహనా దారులకు సూచించారు. ముస్తాబాద్ మండల కేంద్రం లో ముస్తాబాద్ ఎస్ ఐ గణేష్ తో కలసి ప్రధాన రహదారి గుండా వెళ్లే వాహనాలను తనిఖీ నిర్వహించారు.వాహనదారులు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి వస్తుంది తెలిపారుఇకపై ఎవరైనా వాహనానికి సంబంధించిన పేపర్లు లేకుండా నెంబర్ ప్లేట్లు లేకుండా ట్రిపుల్ రైడ్ చేసిన మైనర్లకు వాహనాలు ఇచ్చిన చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా వాహనదారులకు నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. ఏ విషయంలోనైనా పోలీసులు మీకు సహకరిస్తారని పోలీసులకు మీరు కూడా సహకరించాలని చట్టబద్ధంగా ఏ పనైనా పోలీసులు చేస్తారని చట్ట వ్యతిరేక పనులు చేస్తే మాత్రం కఠినంగా శిక్షించాల్సి వస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు
.
Aksharam Telugu Daily