Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం/ సెప్టెంబర్14/ అక్షరం న్యూస్ : భద్రాచలంలో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పట్టణంలోని ఆర్ నాగేశ్వరావు హాస్పిటల్ సందులో ఏర్పాటుచేసిన ఘన నాధుడి మండప సన్నిధిలో ఆదివారం సాయంత్రం 7 గంటలకు శ్రీరామ నాట్యాలయం ఆధ్వర్యంలో చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇప్పటికే భద్రాచలంలో గతంలో ఎన్నడు లేని విధంగా ముంబై నుండి గణనాథుడి విగ్రహాన్ని తీసుకురాగా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నృత్య ప్రదర్శనను నిర్మించడంతో సర్వత్ర ఆసక్తి నెలకొన్నది.
.
Aksharam Telugu Daily