Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : ... మహబూబాబాద్/గార్ల/సెప్టెంబర్9/అక్షరం న్యూస్... గత వారం రోజులుగా ఏడతేరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గార్ల మండల కేంద్రమైన పుట్టకోటలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన మస్న ప్రసాద్ ఇల్లు కూలిపోయి ప్రమాదం తప్పింది.అతనికి మానసిక స్థితి బాగోలేని చెల్లెలు అప్పుడే బయటికి వెళ్లిన కొద్ది సమయంలోనే ఇల్లు కూలడంతో ప్రమాదం తప్పినట్లు మస్న ప్రసాద్ తెలిపారు.ఎలాంటి ఆధారం లేని,రోజు కూలి చేసుకుని జీవిస్తూ,తమకు ఇల్లు కూలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.పలువురు ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వెంటనే ఆదుకోవాలని, తగు సహాయ సహకారాలు అందించాలని, సంబంధిత అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
.
Aksharam Telugu Daily