Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : . ... మహబూబాబాద్ /గా ర్ల /జులై 25/అక్షరం న్యూస్... మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, చిన్నకిష్టపురం గ్రామపంచాయతి, దేశ్యతండ గ్రామ ప్రజలకు సరఫరా చేస్తున్న మంచినీరు కలుషితం అవుతుందని. గేట్ వాల్వ్ వద్ద వాల్ చెక్ పైపులు లికేజి మూలంగా గుంతలో వృధా నీరు, మురికి నీరు చేరి మురికిగా మారుతుందని,మురుగునీరు పైపు లైన్ లోకి చేరి తాగునీరు కలుషితం అవుతుందని అక్షరం దినపత్రిక లో వెలువడిన కథనానికి స్పందించిన గ్రామపంచాయతి కార్యదర్శి, తక్షణ చర్యల్లో భాగంగా గెట్ వాల్వ్ కు మరమ్మతులు చేసి, స్వచ్ఛమైన మంచినీరు అందించారు.ప్రజల పక్షాన నిలబడి, సమస్య ను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేసి, ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించడంలో భాగస్వామి అయినా అక్షరం దినపత్రిక యాజమాన్యం కు ప్రజలు కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నారు.
.
Aksharam Telugu Daily