Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : ? మహబూబాబాద్ /గార్ల /జులై 31/అక్షరం న్యూస్... విద్యార్థులు, యువకులు, క్రీడాకారులు క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వంలో ఊరురా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు.ఇందు కోసమం రు. లక్షల్లో వ్యయం చేశారు. కానీ నేడు క్రీడా ప్రాంగణాల నిర్వహణ పట్టించుకోకపోవడంతో, క్రీడామైదానము ఆటలకు అనువుగా లేకపోవడంతో నిర్దేశిత లక్ష్యం నెరవేరడం లేదు. వివరాలలోకి వెళితే, మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, చిన్నకిష్టపురం గ్రామపంచాయతీ లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం మురుగు నీరు, చెత్త కుప్పలకు నిలయంగా మారిపోయింది. మురుగు నీటికి, వర్షపు నీరు కలిసి భరించరాని దుర్వాసన వస్తుంది. క్రీడాప్రాంగణం డంపింగ్ యార్డుగా మారిపోయి, క్రీడాకారులకు అసౌకర్యంగా మారిపోయింది. క్రికెట్, వాలిబల్ తోపాటు,వ్యాయమం చేసేవారికి అనువుగా ఉన్న క్రీడా ప్రాంగణం వర్షపు నీరు నిలిచి, ఎక్కువ రోజులు పాటు నీరు నిల్వ ఉండటం వల్ల పాచిపట్టి దుర్వాసన వెదజల్లడంతోపాటు క్రీడాకారులు, యువకులు, విద్యార్థులు జారీ కింద పడే ప్రమాదం ఉంది. అధికారుల పర్యవేక్షణ లోపం మూలంగా క్రీడా ప్రాంగణం కాస్త డంపింగ్ యార్డు గా మార్చివేసినారు. తక్షణమే క్రీడాప్రాంగణంలో చెత్త కుప్పలను, మురుగు నీటి ని తొలగించి, క్రీడాకారులకు అనువుగా మార్చాలని ఇందుకు ఎంపీడీఓ, గ్రామపంచాయతీ కార్యదర్శి చర్యలు చేపట్టాలని క్రీడాకారులు, యువకులు, విద్యార్థులు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily