Sunday, 08 September 2024 08:17:48 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

బాబోయ్ ప్రయి'వేటు' పాఠశాల?

చదువు కొనాల్సిందే... విద్య హక్కు చట్టమా నీవెక్కడ... సదువు సారేడు,ఫిసులు బారేడు... ఉన్నత అధికారుల పర్యవేక్షణ కరువు... విద్య అంగట్లో వ్యాపారమేనా... పుస్తకాలతో పాటు అన్ని పాఠశాలలో అందుబాటులో... ఎం ఆర్ పి కంటే అధిక రేటుకు అమ్మకాలు... విద్యాశాఖ అలసత్వం విద్యార్థులకు శాపమేనా


M. SURESH BABU , GARLA MANDAL REPORTER, MAHBUBABAD.

Reporter

Date : 25 July 2024 09:58 AM Views : 352

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : ..? ... మహబూబాబాద్ /గార్ల /జులై 25/అక్షరం న్యూస్... సదువు సారేడు ఫిసులు బారేడు అన్నట్లు ఉంది ప్రయివేటు పాఠశాల తీరు.ఉన్నత చదువులు అంగట్లో అందుబాటులో ఉన్నాయి అన్నట్లు ఉంది ప్రయివేటు పాఠశాలల పనితీరు.మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రయివేటు పాఠశాలల దందా మూడు పువ్వులు అరుకాయలుగా సాగుతుంది. ఉన్నత చదువులు విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారాయి. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తాము పెట్టిందే సిద్ధాంతం అంటూ అధిక ఫిసులు వసులు చేస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులకు పెను భారంగా మారింది. స్కూల్ మొదలు అడ్మిషన్ ల పేరుతొ వేలకు వేలు వసులు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్మకూడదని ఆదేశాలు ఉన్న, తమకేమి పట్టనట్లు ఎం ఆర్ పి కి మించి ఇష్టానుసారంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అమ్ముతు లక్షలు గడిస్తున్నారు. స్కూల్ యూనిఫామ్ లతో పాటు టై లు, బెల్ట్ లు, షు లు అన్ని అంగట్లో అందుబాటులో ఉన్నాయంటూ పవిత్ర పాఠశాలను అంగడి సంతగా మారుస్తున్నారు. ఇదంతా తెలిసిన విద్యాశాఖ అధికారులు సైతం తమకేమి పట్టనట్లు వ్యవహరించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ గోడును ఎవ్వరి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. మరోవైపు ఉన్నత చదువులకై ప్రభుత్వ గురుకుల, నవోదయ ఎంట్రెన్స్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలలో టిసి కోరగా దానికి సైతం వేలల్లో డబ్బులు వసులు చేస్తున్నారు.నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులను ప్రభుత్వం గుర్తించి నవోదయ, గురుకుల వంటి పాఠశాలల్లో సిటు అందించినప్పటికీ,ప్రయివేట్ పాఠశాలల చేతివాటం వల్ల అధికాస్త తల్లిదండ్రులకు శాపంగానే మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ప్రయివేటు పాఠశాలలలో మొత్తం ఒక్కసారిగా కడితే 10% డిస్కౌట్ అంటూ ఆఫర్ లు సైతం పెడుతున్నప్పటికీ అధికారులు మాత్రం అటు వైపు కన్నీత్తి చూడటం లేదు. ఒక్కవైపు తెలంగాణ ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలలో నిర్దేశిత ఫీజులను అందుబాటులో ఉంచగా విద్యాశాఖ అలసత్వం వల్ల అధికాస్తా అందని ద్రాక్షగానే మారింది.మరోవైపు పరిమితికి మించి ఆటోలు టాటా ఏసీ లు, బస్సులల్లో విద్యార్థులను తీసుకుని వస్తు ప్రమాదలు జరిగి, విద్యార్థుల ప్రాణాలను గాలిలో దీపాలుగా మారుస్తున్నారు.ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :