Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం : గోదావరి వరదల సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.ఈసారి రెండుసార్లు గోదావరి వరదలు ఉదృతంగా వచ్చినా, ఒక్క చుక్క వరద నీరు పట్టణంలోకి రాకుండా కట్టుదిట్టం చేశాం. పవిత్ర పుణ్య క్షేత్రం, భద్రాచలాన్ని అందంగా, ఆరోగ్యంగా, భక్తులందరూ కొనియాడేలా భద్రాచలాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారుల పనితీరు అభినందనీయం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరదల వలన జరిగిన నష్టాన్ని అన్నివిధాలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకుంటున్నారు. గతంలో గోదావరి వరదల కారణంగా పరీవాహక ప్రాంతంలో ఆస్తినష్టం ప్రాణ నష్టం భారీగా జరిగాయి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు ప్రణాలికలు రూపొందించి ఎక్కడా ఎటువంటి నష్టం జరగకుండా చూస్తున్న ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం దే...
-
Aksharam Telugu Daily