Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : మహబూబాబాద్/గార్ల/సెప్టెంబర్13/అక్షరం న్యూస్... వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా, సీజనల్ వ్యాధులు ప్రభలకుండా, పేద, మధ్య తరగతి, గిరిజన ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ కోరారు. మెగా వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులచే చికిత్స, ఉచిత పరీక్షలు నిర్వహించి,ఉచిత మందులు పంపిణీ చేయబడుతాయని తెలిపారు. వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ , గైనకాలజి, పీడియాట్రీక్, డెంటల్, కంటి, ఆయూష్ డాక్టర్ లచే పరిక్షలు నిర్వహించబడుతాయన్నారు.వరద బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకుల పంపిన కూడా చేస్తున్నట్లు తెలిపారు.జనహిత సేవా ట్రస్ట్, శ్రీ సత్య లయన్స్ కంటి ఆసుపత్రి, సుశృత ఫౌండేషన్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముల్కనూర్ (గార్ల) సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం గార్ల మండల కేంద్రంలో శనివారం రోజున ఉదయం : 09:30 నుండి 02:30 వరకూ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం,సిహెచ్ సి గార్ల ఎదురుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ మెగా వైద్య శిభిరాన్ని జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు.
.
Aksharam Telugu Daily