Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : చొప్పదండి/ కరీంనగర్, సెప్టెంబర్ 11 (అక్షరం న్యూస్ ) తెలంగాణ రాష్ట్ర మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా చొప్పదండి మండల కేంద్రానికి చెందిన పిట్టల వెంకటేష్, నూనె శేఖర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర మత్స్య కారులు, మత్స్య కార్మిక సంఘం ( టి ఎం కె ఎం కె ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేల్లెల బాలకృష్ణ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ముకుంద లాల్ మిశ్రా భవన్లో జరిగిన జిల్లా జనరల్ బాడీ ఎలక్షన్ లో ఎన్నికైనట్లు గా తెలంగాణ రాష్ట్ర మత్స్యకారులు, మత్స్య కార్మికుల సంఘం జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు పిట్టల వెంకటేష్, నూనె శేఖర్ లు తెలిపారు. ఈ సందర్భంగా చొప్పదండి ముదిరాజ్ సంఘం మత్స్యకారులు, తమ చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన హైడ్రా ను, రాష్ట్రవ్యాప్తంగా విస్తరింప చేసేలా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేల్లెల బాలకృష్ణను కోరారు. ఎన్నికైన జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు వెంకటేష్, శేఖర్ లు మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘాన్ని మరింత బలోపేతం చేసి, మత్స్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్రస్థాయికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని, తమ నియామకానికి సహకరించిన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణకు, జిల్లాలోని మత్స్యకారులు, కార్మికులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్టల సంపత్, ఘన వేణి లచ్చయ్య, తామర మల్లేశం, నరసయ్య, బినవే ని మల్లేశం, అధిక సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నా
-
Aksharam Telugu Daily