Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ... ఖమ్మం/ తల్లాడ ఆగస్టు 25 (అక్షరంన్యూస్) తల్లాడ మండలం మిట్టపల్లి నుండి రంగం బంజరు వరకు రోడ్డు కరిగిపోయి పిడతలుగా ఏర్పడి ప్రమాదకరంగా మారింది. .ఇలా రోడ్డు జారీ పిడతలగా ఏర్పడడం వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రంగం బంజరు వద్ద రోడ్డు పై ఏర్పడ్డ జారుడు పెచ్చులు వల్ల ఓ విద్యార్థికి గాయాలైనవి అక్కడున్న స్థానికులు అటు వైపు వస్తున్న వాహనంపై ఆ చిన్నారిని తరలించారు. ఇలా రోజుకో ప్రమాదం ఈ రోడ్డుపై జరుగుతుంది ఆర్ అండ్ బి అధికారులు జోక్యం చేసుకొని రోడ్డుపై తారు జారి ఏర్పడుతున్న లాంటి రోడ్డుపై ఉన్న దిబ్బలను తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ వార్తను అక్షరం న్యూస్ లో మే నెల 24వ తేదీన ప్రచురించిన విషయం విధితమే. ఈ వార్తకు స్పందించిన అధికారులు ఆ రహదారికి మరమ్మత్తులు చేపట్టారు. పెచ్చులను తొలగించి చదును చేసి ప్రధాన రహదారి సమానంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టారు. దీంతో మిట్టపల్లి గ్రామం నుండి కల్లూరు వరకు వెళ్లే ప్రధాన రహదారి సదును చేసి శుభ్రం చేశారు. అక్షర న్యూస్ వార్తకు స్పందించిన ఆర్ అండ్ బి అధికారులు తగు చర్యలు తీసుకున్నారు అదేవిధంగా సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ దృష్టికి వెళ్లడంతో వారి ఆదేశాల మేరకు అధికారులు రోడ్లకు మరమ్మత్తులు చేపట్టారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్షరం న్యూస్ లో ఈ వార్త ప్రచురణ పట్ల పలువురు నాయకులు, స్థానిక ప్రజలు మీడియా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
.
Aksharam Telugu Daily