Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం సెప్టెంబర్ 12 అక్షరం న్యూస్ : షేక్ ఇమామ్ పి సి నెంబర్ ఏ ఆర్ పి సి-1148 భద్రాచలం ఏ ఎస్ పి ఆఫీసులో గన్ మాన్ గా గత మూడు సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు. ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ అయినా రోహిత్ రాజ్ కుమార్ గతంలో భద్రాచలం ఏఎస్పీగా ఉన్నప్పుడు వారి వద్ద గన్ మాన్ గా చేశాడు. ఇమామ్ తన పిల్లలలో షేక్ రెహమాన్(19) మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. తనకు వచ్చే జీతంతోనే అటు కుటుంబ పోషణ ఇటు తన పిల్లోడి యొక్క వైద్య ఖర్చులను భరిస్తూ ఇబ్బంది పడుతూ ఉండేవాడు. నాడు ఒకానొక సందర్భంలో ఇతని యొక్క పరిస్థితిని తెలుసుకొని రోహిత్ రాజ్ కుమార్ ఎస్పీ నాటినుండి నేటి వరకు తనకి ఆర్థిక సాయం సాయం చేస్తూ తన మిగతా పిల్లలకి ఉన్నత విద్య కై మార్గం నిర్దేశకం చేస్తూ ఉన్నారు. తాను బదిలీపై వేరే జిల్లాకు వెళ్లిపోయిన కూడా రెహమాన్ యొక్క ఆరోగ్యం ఎలా ఉందని నిత్యం ఇమామ్ ద్వారా తెలుసుకున్నారు. నాడు ఏఎస్పీగా వెళ్లిపోయిన నేడు ఎస్పీగా తిరిగి భద్రాద్రి కొత్తగూడెం కి వచ్చిన కూడా తాను అదే మానవత దృక్పథంతో ఉండి ఇమామ్ యొక్క పిల్లగాడి ఆరోగ్య విషయంలో అంతే శ్రద్ధతో ఉండి, పోలీస్ శాఖ వారి నుండి వచ్చే భద్రత సహాయాన్ని కూడా అందించి పిల్లవాడి వైద్య ఖర్చులకు ఉపయోగపడేలాగా చేశారు. ఇమామ్ వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఎస్పీ కి కృతజ్ఞత భావులై ఉంటామని వారి సహాయాన్ని వారి పిల్లలకు చేసిన మార్గ నిర్దేశకాలకు వెలకట్టలేనిదిగా భావించి వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. పోలీస్ శాఖలో ఉన్నత స్థితిలో ఉండి తన వద్ద పనిచేసే వారి కుటుంబ సంరక్షణకై వారికి సహాయం చేయుటలో ఎప్పుడు ముందుండే భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజకుమార్ వృత్తిపట్ల హుందాతనం అలాగే వ్యక్తిగతంగా కూడా మానవతా హృదయం కలిగిన వారిని తెలియజేస్తూ వారికి ఇదే మా సెల్యూట్. జైహింద్.
-
Aksharam Telugu Daily