Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /సెప్టెంబర్ -03(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండలం బంధన్ కల్ ఉర చెరువు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు నిండుకుండలా మారి మత్తడి దుంకుతుండడంతో బంధన్ కల్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రైతులు చెరువులో నీరు సమృద్ధిగా ఉండడంతో పంటలకు ఎటువంటి లోటు ఉండదన్నారు. ఎక్కువగా వరిని పండిస్తున్నామని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు దీంతో పంట పొలాలకు నీరు అందుతుందని రైతులు, ఉపాధి దొరుకుతుందని మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉర చెరువు లో నీరు ఉండడం వలన చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో భూగర్భ జలాలు పెరుగుతాయి అని, ఉర చెరువు కింద 100ఎకరాల కు ఆయకట్టు పారుతుంది అని గ్రామస్తులు తెలిపారు
.
Aksharam Telugu Daily