Sunday, 08 September 2024 08:14:12 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

అస్తవ్యస్తంగా వెంకటరాముని తండా గ్రామం..

వర్షం వస్తే మురికి నీటితో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు.. సమస్యను పరిష్కరించాలని తండావాసులు వేడుకోలు..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 20 July 2024 12:14 PM Views : 881

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ జూలై 20 (అక్షరంన్యూస్) తల్లాడ మండలంలోని వెంగన్నపేట గ్రామం పంచాయతీ పరిధిలో వెంకటరాముడుతండా అస్తవ్యస్తంగా తయారయింది. గ్రామంలో సిసి రోడ్లు వేసినప్పటికీ వర్షపు నీరు నిల్వ ఉండటంతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో సైడ్ కాలవల్లో మురికినీరు వెళ్లేందుకు సౌకర్యం లేకపోవడంతో సిసి రోడ్లపైనే ఆగిపోతున్నాయి. దీంతో సిసి రోడ్లన్నీ మురికి నీటితో దర్శనమిస్తున్నాయి. ప్రజలు ఇళ్లల్లో వాడుకున్న నీటితో పాటు వర్షపు నీరు సైతం వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో సిసి రోడ్లపైనే ఆగిపోతున్నాయి. దీంతో గ్రామస్తులు పలు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఇదే దుస్థితి నెలకొన్నప్పటికీ మారుమూల గ్రామం కావడంతో పట్టించుకునే వారే కరువయ్యారు. మండల అధికారులు అటువైపు వచ్చిన దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. తండాలో నిత్యం గిరిజనులు అధికంగా ఉండటంతో ఈ సమస్య మరింత జటిలంగా మారింది. అసలే సీజనల్ వ్యాధులు కాలం కావడంతో దోమలు వృద్ధి చెంది రోగాలు బారిన పడే అవకాశం మెండుగా ఉంది. అదేవిధంగా వ్యాధులు సోకే అవకాశం ఉండటంతో మురికి నీటిని తొలగించే మార్గాలు చేయాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మండల అధికారులు ఆ గ్రామాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరించాలని తండావాసులు వేడుకుంటున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :