Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/ వైరా సెప్టెంబర్ 4 (అక్షరంన్యూస్) వరద బాధితులకు నేరుగా సాయం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు బురద జల్లడం మానుకోవాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు పరికపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ సందర్భంగా వరద బాధితులకు ప్రభుత్వం సహాయం అందించలేదంటూ బీఆర్ఎస్ నేతల విమర్శలపై ఆయన మాట్లాడుతూ... గత రెండు రోజులుగా సీఎం ప్రజల మధ్య ఉన్నారని అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ బాధితులకు భరోసా అందిస్తూ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారని తెలిపారు. విదేశాల్లో ఉండి బురద రాజకీయాలు చేయడం కేటీఆర్ మానుకోవాలని పరికపల్లి శ్రీనివాస్ హితువు పలికారు.
.
Aksharam Telugu Daily