Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ సెప్టెంబర్ 8 (అక్షరంన్యూస్) ఖమ్మం నగరంలో మున్నేరు వరద బాధితులను పరామర్శించడానికి బిజెపి నాయకుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ఉదయం ఖమ్మం చేరుకున్నారు. ఖమ్మంలోని 16 డివిజన్ దంసలాపురం లో మున్నేరు వరద బాధితులను పరామర్శించారు. కేంద్రం అన్ని విధాల సాయం అందిస్తుందని బాధితులకు భరోసా కల్పించారు. అనంతరం తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాలో వరద బాధితులను పరామర్శిస్తారు . వీరి వెంట రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , బిజెపి ఎంపీలు ఈటెల రాజేందర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,జిల్లా అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily