Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్ధిపేట/బెజ్జంకి : బెజ్జంకి/సిద్దిపేట,సెప్టెంబర్12(అక్షరం న్యూస్) :-ఇటీవల ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షాల కారణంగా మండల పరిదిలోని తోటపల్లి బేగంపేట వరకు గల ప్రధాన మార్గంలో తోటపల్లి గ్రామ శివారులో చెట్టు రోడ్డు పైకి వంగి ప్రయాణాలకు ఇబ్బంది మారింది.తోటపల్లి గ్రామంలో గల రాజీవ్ రహదారికి అనుసందానంగా బేగంపేట వరకు ఈ రోడ్డు మార్గం అణువుగా ఉండడంతో రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం వందల సంఖ్యలో తోటపల్లి,వీరాపూర్,లక్ష్మీపూర్,బేగంపేట గ్రామాల ప్రజలు,రైతులు అవసరాల నిమిత్తం ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటారు.చెట్టు రోడ్డు వైపు వంగడం రాత్రి సమయంలో మరింత ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎదైనా ప్రమాదం జరగకముందే సంబందిత అధికారులు,ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు పైకి వంగిన చెట్టును తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
-
Aksharam Telugu Daily