Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెంజిల్లా/కొత్తగూడెం/సెప్టెంబర్14/అక్షరం న్యూస్ : భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇది భారత పౌరులుగా మనం గర్వంచదగ్గ విషయమని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీల ఆహ్వానం మేరకు శనివారం పట్టణ, పరిసర ప్రాంతాల్లోని మండపాలు సందర్శించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ పండుగలు, ఉత్సవాలు ప్రజల మద్య ఐక్యత పెంచేందుకు, సోదరభావాన్ని పెంపొందించేందుకు వేదికలుగా నిలుస్తున్నాయన్నారు. కులమతాలకతీతంగా అన్ని పండుగలు కలిసిమెలిసి జరుపుకోవడం మన ప్రాంతంలోనే కాకుండా యావత్ దేశంలో జరుపుకోవడం ఐక్యతకు నిదర్శనమన్నారు. గణేష్ ఉత్సవ కమిటీలు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమేకాకుండా పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం, అందరికి ఏకతాటిపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ ఆనవాయితీని భవిష్యత్తులో మరింత ఉత్సహంగా నిర్వహించాలని సూచించారు. మండపాలవద్ద పారిశుద్ధ్య సమస్య, విద్యుత్ సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఉత్సవ కమిటీల భాద్యులు కూనంనేనిని, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె. సాబీర్ పాషాను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు దుర్గరాశి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి మురళి, గెద్దాడు నగేష్, పోలమూరి శ్రీనివాస్, రాంజి, కంచర్ల జమలయ్య, భూక్య శ్రీనివాస్, సుగుణ, పిడుగు శ్రీనివాస్, నేరెల్ళ సమైక్య, లగడపాటి రమేష్, పి.సత్యనారాయణచారి, బోయిన విజయ్ కుమార్, యూసుఫ్, ధర్మరాజు, దాసరి శ్రీనివాస్, నేరెళ్ళ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily