Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తల్లాడ జూలై 25 (అక్షరంన్యూస్) తల్లాడలోని మహిళ సంఘాల భవనం ( స్త్రీశక్తి ) నిర్మాణాలు శిలాఫలకానికే పరిమితమయ్యాయి. తల్లాడలో ఆ భవనాల నిర్మాణానికి గత ప్రభుత్వం 25 లక్షలు మంజూరు చేసింది. అదేవిధంగా ఆ భవనాల నిర్మాణానికి అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపనలు కూడా చేశారు. అయినా కూడా ఇప్పటివరకు ఆ భవనాలు నిర్మాణాలు జరగటం లేదు. ఇలా శిలాపలకానికే పరిమితమై వెక్కిరిస్తున్నాయి. దీంతో మహిళా సంఘాలు ఆ పాత భవనంలోనే విధులు నిర్వహిస్తున్నారు. శిధిలావస్థలో ఉన్న ఆ భవనం ఎప్పుడు కూలుతుందోననే ఆందోళనలో మహిళలు ఉన్నారు. అధికారులు ఇప్పటివరకు ఆ భవనంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆ భవనంలోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు లక్షలాది రూపాయలు మంజూరు చేస్తున్నప్పటికీ భవనాలు నిర్మించడంలో వెనకడుగు వేస్తున్నారు. తల్లాడ మండల వ్యాప్తంగా 27 గ్రామపంచాయతీలకు చెందిన మహిళా సంఘాలు ఈ కార్యాలయానికి నిత్యం వస్తూ పోతుంటారు. ఈ ప్రభుత్వంలోనైనా తల్లాడ మండల స్త్రీశక్తి భవనాలు నిర్మించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily