Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : మహబూబాబాద్ /గార్ల /జులై 20/అక్షరం న్యూస్... రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఇల్లు కూలిపోయిన మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం,బుద్ధారం గ్రామానికి చెందిన ఉప్పరపల్లి పద్మ కుటుంబానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశానుసారం గార్ల పిఏసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆర్థిక సాయం అందించారు. అనంతరం గార్ల పిఏసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి సమస్యను తీసుకెళ్లి, ప్రజా ప్రభుత్వం తరుపున బాధిత కుటుంబానికి ఆదుకునేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఎస్ఐ జీనత్ కుమార్,కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily