Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : వాతావరణ శాఖ సమాచారం ప్రకారం 31-08-24 శనివారం నుండి బుధవారం04- 09 -24 వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పట్టణ పంచాయతీ , గ్రామ పరిధి లోని. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, సుదూర ప్రాంత ప్రయాణాలు చేయరాదని, ప్రజలు ప్రయాణించే మార్గంలో వాగులు వంకలు దాటరాదని, గ్రామీణ ప్రాంతంలోని మట్టి గోడల ఇల్లు, పాకలలో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. జిల్లా అధికారులందరూ సమైక్యంగా పనిచేసి ఎటువంటి నష్టం కలగకుండా తమ వంతు బాధ్యతలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
-
Aksharam Telugu Daily