Sunday, 08 September 2024 08:28:35 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి వినతి పత్రం అందించిన ఏజెన్సీ గౌడులు.....

ఏజెన్సీలో ప్రభుత్వ ఫలాలు అందక గౌడన్నలు పడుతున్న ఇబ్బందులు గూర్చి వినతి. - ఏజెన్సీ గౌడును ఎస్టి గా ధ్రువీకరించాలని కోరిన గౌడన్నలు ... - సానుకూలంగా స్పందించిన మంత్రిపొన్నం ప్రభాకర్


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 23 July 2024 07:06 PM Views : 735

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/పినపాక : - ... భద్రాద్రికొత్తగూడెం, పినపాక, జులై 23(అక్షరంన్యూస్ ): ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ ఫలాలు అందక, ఇన్సూరెన్స్ వర్తించక కొట్టుమిట్టాడుతున్న గౌడన్న దుస్థితి గూర్చి తెలుపుటకు నేడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి వినతి పత్రాన్ని అందించిన మారుమూల ప్రాంతమైన పినపాక,కరకగూడెం, మణుగూరు గౌడ సంఘీయులు. ఏజెన్సీ గ్రామాల ఆదిమ స్థిర నివాసులైన గౌడుల సమస్యలను గూర్చి 1950 -56 సంవత్సరంలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 342 ఐదవ షెడ్యూల్ సవరించిన చట్టం 108/1977 జీవో నెంబర్ 58 సీరియల్ నెంబర్ 7 ప్రకారం అనగా ప్రస్తుత జీవో 5 ప్రకారం ఏజెన్సీ ఏరియా గౌడులు షెడ్యూల్ తెగ( ఎస్టి ) గా మన గౌరవ రాష్ట్రపతి గారి సంతకం పొందుపరచనఅయినది. పై విషయం పై మేము గత కొంతకాలంగా పై అధికారులను మమ్ములను రెవిన్యూ ఎంక్వయిరీ ఇప్పించవలసిందిగా కోరుతూ ఏజెన్సీ గౌడ్ కి ఎస్టీ కుల ధ్రువీకరణ అందించాలని ఎంతో మంది అధికారులను వేడుకోవడం జరిగింది. అయినను మా గోడును ఆలకించినటువంటి వారు లేరని ఏజెన్సీలో మమ్ములను చిన్న చూపు చూడడం వల్ల ప్రభుత్వం నుండి గౌడ్ అన్నకు అందే పథకాలు మేము అందుకోలేకపోతున్నాంఅని . చెట్టు పైనుండి పడితే భరోసా లేక పోయే, ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం ఇస్తున్న ఇన్సూరెన్స్ అందుకునే పరిస్థితిలో లేని దుస్థితిలో మేము బ్రతుకుతున్నామని మా యొక్క ఆర్థిక స్థితిగతులను ఆలోచించి మా పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎన్నో ఏళ్లుగా మూలుగుతున్న ఏజెన్సీ గౌడ్ అన్నల సమస్యను పరిష్కరించాలని గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని కోరడం జరిగింది. నాటి ప్రతిపక్ష నాయకులు నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఆనాడు అసెంబ్లీలో ఏజెన్సీ గౌడులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి ఎస్టి కుల ధ్రువీకరణ పత్రమును ఇవ్వాలని కోరుతూ ఆనాడు గళం విప్పి మా సమస్యను ప్రస్తావించారు కాబట్టి నేడు మా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాం. గౌరవ శ్రీ ముఖ్యమంత్రివర్యులు ఇనుముల రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో కొంచెం పెద్ద మనసు చేసుకొని ఏజెన్సీలో కొట్టుమిట్టాడుతున్న గౌడుల బతుకులు మార్చుట కొరకు ఏజెన్సీలో నివసిస్తున్న ప్రతి ఒక్క గౌడన్నకు ఎస్టి కుల ధ్రువీకరణ పత్రము అందేలా కృషి చేయాలని కోరడం జరిగింది. ఏజెన్సీ గౌడ్ అన్న సమస్య తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. మంత్రి గారికి సాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరకగూడెం గౌడ సంఘీయులు రావుల రవి గౌడ్, లీలా వాసు, చీకటి రామచంద్రయ్య, పినపాక మండల గోపాలరావు పేట గౌడ సంఘీయులు, కొంపెల్లి నాగేశ్వరరావు, కొంపెల్లి మల్లేష్ గౌడ్, చిర్ర కుమార్, జలగం కనకయ్య గౌడ్, జలగం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :