Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /సెప్టెంబర్ -09(అక్షరం న్యూస్ ) అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని ముస్తాబాద్ మండల కేంద్రం లోని తెర్లు మద్ది ఎక్స్ రోడ్ వద్ద పట్టుకున్నట్లు ఎస్సై గణేష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన కడమంచి గట్టయ్య అనే వ్యక్తి ప్రభుత్వ ప్రజా పంపిణీ బియ్యం ను అక్రమంగా సేకరించి ఎక్కువ ధరకు అమ్ముకొనుటకు ఏ పి 15 టీ సి 3978నెంబర్ గల ఆటో లో తరలిస్తుండగా తెర్లుమద్ది క్రాస్ రోడ్ వద్ద పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ ఐ గణేష్ తెలిపారు , ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు అని ఎస్ ఐ హెచ్చరించారు .
.
Aksharam Telugu Daily